కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు విష్ణు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని `మోసగాళ్లు` మొదలెట్టాడు. ఆ సినిమాని నిర్మాత కూడా తానే. ఈమధ్యన `చదరంగం` పేరుతో ఓ వెబ్ సిరీస్ నిర్మించాడు. ఇప్పుడు మరో నాలుగు చిన్న సినిమాల్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ యేడాదే ఈ నాలుగు చిన్న సినిమాలూ సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. వీటికి సంబంధించిన కథలు సిద్ధమయ్యాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన దర్శకుల్నీ ఫిక్స్ చేసేశాడు. ఓ సినిమాలో హాస్య నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తాడని టాక్. మరో మూడు సినిమాల్లోనూ కొత్తవాళ్లే హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాల్ని పరిమిత బడ్జెట్లో ప్యాక్డ్గా తీయాలని, అవసరమైతే ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కి అమ్మినా, పెట్టిన బడ్జెట్లు తిరిగొచ్చేలా పకడ్బందీ ప్రణాళికతో సినిమాల్ని తీయాలని ఫిక్స్ అయ్యాడు విష్ణు. ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన ప్రకటన ఒకేసారి విడుదల చేసి సర్ప్రైజ్ చేయాలని విష్ణు భావిస్తున్నాడు. మరోవైపు మంచు మనోజ్ కూడా రీ ఎంట్రీ గ్రాండ్ గా ఇవ్వాలని భావిస్తున్నాడు. `అహం బ్రహ్మస్మి` పేరుతో మనోజ్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి మనోజ్‌నే నిర్మాత. ఇది కాకుండా మరో సినిమా కూడా ప్లానింగ్ లో ఉంది. మొత్తానికి మంచి సోదరులిద్దరూ ఇప్పుడు మంచి మూడ్‌లోకి వచ్చేశారు. కరోనా ఎఫెక్ట్ తగ్గితే… వీరి దూకుడు పూర్తి స్థాయిలో చూడొచ్చు.