షూటింగులు ఎప్పుడు మొదలవుతాయా అని సినీ పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తోంది. త్వరలోనే అందుకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అయితే.. చాలా షరతులతో. వాటిలో కొన్ని షరతులు మామూలుగా లేవు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి షూటింగులు చేసుకోవాల్సివుంటుంది. చిత్రబృందంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ముందుగా సర్టిఫికేట్ పొందాల్సివుంటుంది. ఒకవేళ చిత్రబృందంలో ఎవరైనా కరోనా లక్షణాలతో చనిపోయినట్టు నిర్దారణ అయితే… సదరు నిర్మాణ సంస్థ రూ.50 లక్షల నష్టపరిహారాన్ని మృతుడి కుటుంబానికి చెల్లించాలన్నది అందులో ప్రధాన నిబంధన. మిగిలిన నిబంధనల్ని పాటించడానికి చిత్రబృందాలు సిద్ధమవుతున్నా…ఈ రూల్ దగ్గర మాత్రం భయపడుతున్నారు. పొరపాటున అలాంటి మరణం సంభవిస్తే బడ్జెట్లో అరకోటి పెరిగినట్టే. పెద్ద పెద్ద సినిమాలైతే ఈ నష్టభారాన్నీ మోయడానికి సిద్ధపడొచ్చు. మరీ చిన్న సినిమాలైతే ఆ నిర్మాతల పరిస్థితి ఏమిటి? టీవీ సీరియళ్లకూ ఇదే నిబంధన వర్తిస్తుందని సమాచారం. అందుకే షూటింగులకు అనుమతి ఇచ్చినా, నిర్మాతలు రిస్కు చేయడం కష్టమే.