లాక్ డౌన్ 4.0 చాలా సడలింపులతో, ప్రత్యేక ప్యాకేజీలతో వస్తోంది. కేంద్రం బోలెడన్ని మినహాయింపుల్ని ప్రకటించబోతోంది. వాటితో థియేటర్లు తెరచుకోవడానికి అవకాశం లభిస్తుందని ఆశ పడ్డారు నిర్మాతలు, పంపిణీదారులు. అయితే… ఈసారీ సినిమాకి మొండిచేయ్యే ఎదురుకానున్నదని సమాచారం. స్కూళ్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్‌కి మాత్రం ఈ లాక్ డౌన్‌లోనూ అనుమతుల్లేవని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణల్లో థియేటర్లు తెరచుకోనున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాల్లో, ప్రభుత్వం ఇచ్చే మినహాయింపుల్లో థియేటర్లకు ఛాన్సు లేదని తెలుస్తోంది. అయితే షూటింగులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కానీ.. అవి కూడా చాలా నియమనిబంధనలకు లోబడి జరగాలి. ఆ మార్గదర్శకాల్ని పాటించి షూటింగులు చేయడం చాలా కష్టం. జూన్ చివరి వరకూ థియేటర్ల రీ ఓపెనింగ్‌కి అవకాశం లేదని తెలుస్తోంది. వీటిపై ఆశలు పెంచుకున్న నిర్మాతలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్ని వెదుక్కోవాల్సిందే.