టెక్నాలజీ పెరిగింది. సౌలభ్యాలకు మనిషి శరీరం పూర్తిగా అలవాటు పడిపోయింది. ఆఖరికి మాతృత్వం కూడా. సరోగసీ లాంటి విధానాలు ఇప్పుడు సర్వసాధారణం. అయితే ఈ పద్ధతి పట్ల.. ఘాటైన వ్యాఖ్యలు చేసింది యాంకర్, నటి రష్మి. జనాభా పెరుగుతలపై, సరోగసీ విధానంపై రష్మి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. దేశంలోని సమస్యలన్నింటికీ అధిక జనాభానే కారణం అని, పశువులకు అయినా సంతానోత్పత్తికి ఓ సీజన్ ఉంటుందని, మనుషులకు అలాంటివేం ఉండవని, ఎప్పుడు పడితే అప్పుడు పిల్లల్ని కనేస్తారని వ్యంగ్యబాణాలు విసిరింది. దత్తత తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని, సెలబ్రెటీలు కూడా సరోగసీ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు గానీ, దత్తతకు ముందు రావడం లేదని, సరోగసీ విధానంపై పిల్లలు కనడం కూడా ఓ రకమైన వివక్ష చూపించడమే అంటోంది. ఇది కూడా ఓ రకంగా కులాభిమానం, మతాభిమానం లాంటిదే అని, జీన్స్ అనేది పిల్లల విషయంలో కొంత వరకూ వర్కవుట్ అవుతుందని, మిగిలినదంతా పెంపకంలో ఆధారపడి ఉంటుందని, అది తెలిసి కూడా సరోగసీ వెంట పడుతున్నారని మండి పడుతోంది. రష్మి ఎప్పుడూ ఇలాంటి సీరియస్ విషయాలపై, ఇంత సీరియస్‌గా మాట్లాడింది లేదు. మొత్తానికి రష్మిలో కూడా సామాజిక బాధ్యత వచ్చినట్టు కనిపిస్తోంది.