మెగా బ్రదర్ నాగేంద్రబాబుకు హఠాత్తుగా మహాత్ముడ్ని హత్య చేసిన నాథూరాం గాడ్సే గుర్తుకు వచ్చారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు అని స్మరించుకున్నారు. అంతకు మించి… గాడ్సే గొప్ప దేశభక్తుడని కితాబిచ్చేశారు. అదేంటి…దేశం మొత్తంత గాడ్సేను..మహాత్మాగాంధీని చంపిన దేశద్రోహిగా చూస్తోంది కదా..అని చాలా మందికి డౌట్ వస్తుంది. దీనికి ఓ కారణం చెప్పారు నాగబాబు.. అదేమిటంటే..మీడియా. అప్పటి మీడియా కూడా నిజాలు చెప్పలేదట. ప్రభుత్వ అనుకూల వాదనే వినిపించడంలో గాడ్సే విలన్గా దేశ ప్రజల్లో ముద్ర పడిపోయాడనేది నాగబాబు మాట. గాంధీని గాడ్సే హత్య చేయడం వల్ల అపఖ్యాతి పాలవుతానని తెలిసినప్పటికీ.. గాడ్సే గాంధీని చంపేశారని.. నాగబాబు సానుభూతి తెలిపారు.
ఆయన పుట్టిన రోజున గుర్తు చేసుకుని.. పాపం గాడ్సే అని..నాగబాబు ఆవేదన చెందారు. నాగబాబు ఉద్దేశం ప్రకారం.. మహాత్మగాంధీని చంపడానికి గాడ్సేకు బలమైన కారణం ఉంది. ఆ కారణం దేశానికి సంబంధించినదే. దేశం కోసమే..మహాత్ముడ్ని గాడ్సేచంపేశాడని నాగబాబు చెబుతున్నారన్నమాట. అయితే.. నాగబాబుకు ఇంత హఠాత్తుగా ఎందుకు గాడ్సే పై ప్రేమ పుట్టుకొచ్చిందో చాలా మందికి అర్థం కావడం లేదు. దేశంలో ఇప్పటి వరకూ.. కొంత మంది బీజేపీ నేతలు.. ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న వారు నాథూరాం గాడ్సేను పొగుడుతూ ఉంటారు.
ఆయన గొప్ప దేశభక్తుడని చెబుతూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని నేరుగా చెప్పరు. చెప్పలేరు కూడా. అలా చెప్పిన కొంత మంది నేతలపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ప్రకటనలు చేస్తే.. చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో వారూ సైలెంటయ్యారు. అయితే అనూహ్యంగా నాగబాబు… గాడ్సేను దేశభక్తుడ్ని చేయడానికి సిద్ధమయ్యారు. చరిత్రకు కొత్త భాష్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిసిటీకి ఇది దగ్గర దారి అనుకున్నారో… లేక తాను నమ్మిన విషయాన్ని ఆలస్యంగా ప్రకటిస్తున్నారో కానీ..నాగబాబు.. ఓ అడుగు ముందుకేశారని చెప్పుకోవాలి.