ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత క్లీన్‌గా ఉండే సిటీ ఏది అని ఎవరినైనా అడిగితే… అన్ని పట్టణాలు తిరిగిన వారు.. మరో మాట లేకుండా.. విశాఖ అని చెబుతారు. ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించిన పక్కన పెడితే.. సిటీని క్లీన్‌గా ఉంచడంతో.. మున్సిపల్ కార్పొరేషన్, ప్రజలు బాధ్యతగా ఉండేవారు. దాంతో.. వీధులన్నీ ఎప్పుడూ క్లీన్‌గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సిటీకి.. కేంద్ర ప్రభుత్వం.. ఒక్కటంటే.. ఒక్క స్టార్ ఇచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ కాంపిటేషన్- 2020లో భాగంగా ఇచ్చిన ర్యాంకుల్లో విశాఖకు ఒక్క స్టార్ మాత్రమే వచ్చింది. గత ఏడాది టూ స్టార్స్ తెచ్చుకున్న విశాఖ ఇప్పుడు.. గార్బేజ్ నిర్వహణలో తేలిపోయింది. అధికారులు దృష్టి పెట్టకపోవడం.. చెత్త విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో పరిస్థితి మారిపోయింది.
గార్బేజ్ ఫ్రీసిటీస్ అంశం కింద నగరాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను తడి,పొడిగా విభజించడం, డంపింగ్‌యార్డుకు తరలించడం ద్వారా పర్యావరణానికి హానికలిగించకుండా రీసైకిల్ చేయడం.. రోడ్లు, వీధులు పరిశుభ్రంగా వుండేలా చూడడం వంటి అంశాలు ఉంటాయి. విశాఖ అధికారులు తాము “చెత్త”ను బయట కనిపించకుండా చేయడంలో.. ఎక్సలెన్సీ సాధించేశామని అనుకున్నారు. ఎవరూ విశాఖ వచ్చి చూడరని అనుకున్నారో.. తాము చెప్పిందాన్ని బట్టే… కదా ర్యాంకులు ఇస్తారని అనుకున్నారేమో కానీ… విశాఖలో రోడ్లపై అసలు చెత్తే లేదంటూ.. గార్బేజ్ ఫ్రీ సిటీస్ కాంపిటేషన్‌లో ఫైవ్ స్టార్ కోసం అప్లయ్ చేసేశారు.
కానీ ఆయా మున్సిపాల్టీలు ఇచ్చిన నివేదికలు మాత్రమే కాదు.. ప్రత్యేక బృందాలు వచ్చి.. పరిస్థితిని పరిశీలిస్తాయి. ఇలా కేంద్ర బృందాలు పరిశీలించిన తర్వాత అదనపు స్టార్ల సంగతేమో కానీ.. ఉన్న స్టార్ మాత్రం ఒకటి ఊడిపోయింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గార్బేజ్ ఫ్రీ సిటీస్ కాంపిటేషన్‌ను నిర్వహిస్తోంది. ఈ ర్యాంకుల ఆధారంగా తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకునూ నిర్దారిస్తారు. కొసమెరుపేమిటంటే.. విజయవాడ, తిరుపతి నగరాలకు త్రీ స్టార్ రేటింగ్ దక్కింది. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయినప్పటికీ.. ర్యాంక్ తగ్గిపోయింది.