బాలీవుడ్ మాజీ హీరోయిన్ మనీషా కోయిరాలా వివాదంలో చిక్కుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఇండియాపై దూకుడు చూపిస్తున్న నేపాల్‌కు ఆమె మద్దతు పలకడమే దీనికి కారణం. ఇప్పటి వరకూ భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపాల్ ఇప్పుడు..సరిహద్దు వివాదాలను తెస్తోంది. కొత్త మ్యాప్‌లు విడుదల చేసి.. అందులో భారత్ భూభాగాల్ని కలిపేసింది. జమ్మూకశ్మీరు పునర్విభజన తర్వాత భారత్ కొత్త రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. అందులో సరిహద్దు ప్రాంతాలైన లిపులెక్, కాలాపానీ, లింపియధుర కూడా ఉన్నాయి. నేపాల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి తన భూభాగాలని వాదిస్తూ ఏకంగా పార్లమెంటులోనే తీర్మానం చేసింది. కానీ ఈ ప్రాంతాలు భారత్ అంతర్భాగాలే.
నేపాల్ మొన్నటిదాకా అభ్యంతరం కూడా చెప్పలేదు. మానస సరోవర్ యాత్రకు భారతీయ భక్తులు, పర్యాటకులు వెళ్లేందుకు వీలుగా లిపులెక్ పాస్‌ను ఉత్తరాఖండ్‌లోని దర్చులా రోడ్డుకు అనుసంధానం చేసే రోడ్డును ఈ నెల 8న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లిపులెక్ రోడ్డును ప్రారంభించారు. నేపాల్ దీనిపైనా వ్యతిరేకత వ్యక్తంచేసింది. ఇలా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే.. నేపాల్ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. లిపులెక్, కాలాపానీ, లింపియధురలను తన భూభాగంలో చేర్చింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరిస్తామని ప్రధాని ఓలీ ప్రకటించేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ అధీనంలో ఉన్న లిపులెక్, కాలాపానీ, లింపియధురలను తిరిగి తీసుకొస్తామని సవాల్ చేశారు.
చైనా అండతోనే నేపాల్ ఇలా చేస్తోందని అందరికీ తెలిసిపోయింది. ఈ వివాదంపై మనీషా కోయిరాలా స్పందించారు. నేపాల్ గౌరవం నిలబడుతోందని పేర్కొన్నారు. ఆమె.. నేపాలీనే. ఆ దేశాన్ని ఏలిన కోయిరాలా కుటుంబసభ్యురాలే. అయితే… ఆమె చదువు..సినిమా కెరీర్ …అంతా ఇండియానే. ఇప్పుడు కూడా ఆమె ఇండియాలోనే ఉంటున్నారు. ఆమె స్పందన భారత నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. తమ దేశం వెళ్లి మాట్లాడాలని స్పందిస్తున్నారు.