ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దళిత డాక్టర్ సుధాకర్‌పై పోలీసుల దాడి,అరెస్ట్ ఘటన వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తూ.. సీబీఐ విచారణకు ఆదేశించింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి.. విచారణ జరిపి ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు.. గత విచారణ సమయంలో సుధాకర్‌ను హాజరు పరచాలని .. ఆదేశించింది. అయితే పోలీసులు సుధాకర్ చికిత్సలో ఉన్నారని చెబుతూ.. పోలీసులు హాజరు పర్చలేదు. దీంతో హైకోర్టు విశాఖ మెజిస్ట్టేట్ ను వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించింది. మేజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేసి.. హైకోర్టుకు సమర్పించారు. డాక్టర్ సుధాకర్ శరీరంపై గాయాలున్నాయని మెజిస్ట్రేట్ నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక మాత్రం వేరుగా ఉంది. దాంతో ఆ నివేదికను నమ్మడం లేదని స్పష్టం చేశారు. అందుకే సీబీఐ విచారణ చేయించాలని హైకోర్టు నిర్ణయించింది.
డాక్టర్ సుధాకర్ .. నర్సీపట్నం ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడు. ఆయన కరోనా సమయంలో.. పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దాంతో ఆయనను సస్పెండ్ ఏపీ ప్రభుత్వం… పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత హఠాత్తుగా విశాఖలో డాక్టర్ సుధాకర్ ను పోలీసులు పెడరెక్కలు విరిచికట్టి.. చొక్కా లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కక్ష పూరితంగా చేసిన చర్య అన్న ఆరోపణలు వచ్చాయి. డాక్టర్ సుధాకర్ మానసిక ఆరోగ్యం బాగోలేదని.. డాక్టర్ ఓ తెల్ల కాగితం పై రాసి ఇవ్వడం ఆయనను.. ఆస్పత్రికి తరలించడం వివాదాస్పదమయింది. ఈ అంశంపై.. జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. దళిత సంఘాలు.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా.. ఖండించాయి. విశాఖ పోలీసుల తీరు మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై కూడా.. హైకోర్టు సీరియస్ అయింది. విశాఖ పోలీసులపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చినా .. పోలీసు ఉన్నతాధికారులు తీసుకోలేదు. తాజాగా … ఈ సారి సీబీఐ విచారణకే ఆదేశించారు.
డాక్టర్ సుధాకర్ ను ఆస్పత్రిలో కూడా సుఖంగా ఉండనీయడం లేదని .. టీడీపీ నేతలు కొన్ని వీడియోలు విడుదల చేశారు. ఆయన బలవంతంగా రాయించుకుంటున్న దృశ్యాలను విడుదల చేశారు. ఈ పరిణామాలన్నింటితో… హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం కలకలం రేపుతోంది. గతంలో సీబీఐ.. గుంటూరు అర్బన్ ఎస్బీ పీహెచ్డీ రామకృష్ణపై.. అక్రమ నిర్బంధం కేసులో సీబీఐ విచారణకు ఆదేశించింది. అలాగే.. వైఎస్ వివేకా హత్య కేసును కూడా సీబీఐకి ఇచ్చింది. తాజాగా.. సుధాకర్ కేసును కూడా సీబీఐకి ఇచ్చింది.