రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కోనేరు సత్యనారాయణ నిర్మాత. ఈ చిత్రానికి `కిలాడీ` అనే పేరు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం `క్రాక్` సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. మరో 30 శాతం షూటింగ్ బాకీ ఉంది. అది పూర్తయిన వెంటనే ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. రవితేజ – రమేష్ వర్మ కాంబోలో ఇది రెండో సినిమా. ఇది వరకు వీరిద్దరి కలయికలో `వీర` వచ్చింది. ఇటీవల రాక్షసుడు సినిమాతో ఓ హిట్టు అందుకున్నాడు రమేష్ వర్మ. అందుకే రవితేజ నుంచి మరోసారి పిలుపు అందుకోగలిగాడు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. రవితేజ పాత్ర ఎప్పటిలా హుషారుగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. త్వరలోనే నాయికని ఎంపిక చేసి టైటిల్‌తో పాటు, హీరోయిన్ వివరాలనూ అధికారికంగా ప్రకటిస్తారు.