ఓ హీరో వదిలేసిన కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం కామనే. అలా ఒకప్పుడు రామ్ చరణ్ వదిలేసిన కథ.. ఇప్పుడు శర్వానంద్ చేతికి వెళ్లినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ కోసం యూవీ క్రియేషన్స్ ఓ కథని తయారు చేసింది. శర్వా, చరణ్‌ల స్నేహితుడు శ్రీరామ్ రెడ్డి ఈ కథను తయారు చేశాడు. స్క్రిప్టు పూర్తయ్యింది. చరణ్‌కి నచ్చలేదో, లేదంటే.. కుదర్లేదో తెలీదు గానీ, ఆ కథని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ కథని శర్వాతో చేయాలని యూవీ భావిస్తోంది. యూవీ అంటే ఓ రకంగా శర్వా సొంత సంస్థ లాంటిది. అందుకే… ఈ సినిమా సెట్స్‌పై వెళ్లడానికి మార్గం సుగమం అయ్యిందని తెలుస్తోంది.
అయితే శర్వా ఇప్పుడు ఫుల్ బీజీ. చేతిలో ‘శ్రీకారం’ సినిమా వుంది. ‘మహా సముద్రం’ కూడా ఒప్పుకున్నాడు. కిషోర్తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. వాటి మధ్య కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలి. మహాసముద్రంకీ కిషోర్ తిరుమల సినిమాకీ మధ్య యూవీ క్రియేషన్స్ సినిమా పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.