వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా..ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు. ఎప్పటిలాగే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీలోని కొంత మంది వ్యక్తులు కూడా ఇలాంటి ప్రచారంలో భాగమవుతున్నారని.. ఇలాంటి వాటిని పార్టీనే నిలువరించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు గత వారం సీఎం జగన్ ను కలవబోతున్నట్లుగా మీడియాలో వచ్చింది. రెండు రోజుల పాటు వారు సైలెంట్ గా ఉన్నారు. ఖండించలేదు. పర్చూరు ఎమ్మెల్యే ముందుగా కార్యకర్తల సమావేశం పెట్టి.. తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు.
ఇప్పుడు రేపల్లె ఎమ్మెల్యే కూడా అదే ప్రకటన చేశారు. మాహానాడులో తీర్మానం పెట్టాల్సిన అనగాని సత్యప్రసాద్.. గైర్హాజరు కావడంతో మరింతగా ప్రచాతరం ఊపందుకుంది. ఇవాళ వరకూ స్పందించని అనగాని.. ఇవాళ హఠాత్తుగా.. మీడియాకు ప్రకటన పంపారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలవలేదని.. కలిసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. పార్టీ మారమని ఎందరో అడుగుతూంటారని.. అంత మాత్రాన పార్టీ మారినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు… తమపై పార్టీ మార్పు వార్తలు రావడం..వాటిని ఖండించుకోవడం పెద్ద టాస్క్‌గా మారిపోయింది. కొంత మందిని టార్గెట్ చేసి మరీ.. ఇలా ప్రచారం చేస్తూండటం…ఆయా ఎమ్మెల్యేలపై తొందరపడి సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తూండటంతో… పరిస్థితి దిగజారిపోతోంది. ప్రతీ సారి శీలపరీక్ష చేసుకోవాల్సి వస్తూండటంతో.. ఆ ఎమ్మెల్యేలు అసహనానికి గురవుతున్నారు.