ఒకప్పుడు తెలుగు నాట నిత్యమీనన్ హవా బాగా నడిచింది. కాస్త ప్రత్యేకమైన కథానాయిక పాత్రలు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామర్ మాటెలా ఉన్నా, సరదా నటనతో ఆకట్టుకునేది. అయితే ఇప్పుడు తనని అంతా మర్చిపోయారు. కీర్తి, సాయి పల్లవి మ్యాజిక్‌లో పడి తేలుతున్నారు. అయినప్పటికీ అడపా దడపా నిత్యకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనే సరైన రీతిలో వాటిని అందిపుచ్చుకోలేకపోతోంది. కీర్తి సురేష్ చేసిన `మహానటి`కి మొదటి ఆప్షన్ నిత్యమీననే. కానీ ఎందుకో ఆ సినిమాని వదులుకోవాల్సివచ్చింది.
ఇప్పుడు మరో బయోపిక్‌ని కాదనుకుంది నిత్య. ఒలింపిక్స్‌లో భారతదేశానికి తొలి పతకం సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన కరణం మల్లీశ్వరి బయోపిక్ ఇప్పుడు పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం ఇటీవల నిత్యమీనన్‌ని సంప్రదించార్ట దర్శక నిర్మాతలు. కానీ ఈ సినిమా చేయడానికి నిత్య ఉత్సాహం చూపించలేదని తెలుస్తోంది. నిత్య ఈ మధ్య బాగా బరువు పెరిగింది. అయితే కరణం మల్లీశ్వరి పాత్ర కోసం బరువు తగ్గాలి. అలా బరువు తగ్గడం, మళ్లీ పెరగడం నిత్యకు ఇష్టం లేదట. అందుకే ఈ పాత్రకు నో చెప్పేసిందని టాక్. ఇప్పుడు మల్లీశ్వరి పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ని ఎంచుకున్నారంటూ వార్తలొస్తున్నాయి. చివరికి ఆ పాత్ర ఎవరికి సెట్ అవుతుందో చూడాలి.