ప్రజల కోసం ప్రభుత్వాన్ని… అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి పెట్టలేదు.. 23 జిల్లాలకు మంత్రిగా చేసిన తనకు, ఎమ్మెల్యే పదవి అలంకారమేనని తేల్చి చెప్పేశారు. ఆనంకు ఎందుకు కోపం వచ్చిందంటే…తన నియోజకవర్గంలోపనులుజరగడం లేదని. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అనే నియోజకవర్గం ఒకటుందని గుర్తించాలనిఆయనమండిపడ్డారు. మరో ఏడాది వేచి చూస్తానని..పనులు జరగకపోతే..ప్రభుత్వంపై ఉద్యమించడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న తీరు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
నెల్లూరు జిల్లాలో జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని..ఆ లెక్కలేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎస్ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం చెప్పినా అధికారులు వినడం లేదని మండిపడ్డారు. ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఆనం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి ాదు. గతంలో మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించేశారంటూ నేరుగా ప్రభుత్వం పేరు ఎత్తకుండా మండిపడ్డారు. నెల్లూరులో పని చేయాలంటేనే అధికారులు భయపడుతున్నారని, అయిదేళ్ళలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరుకే దక్కిందంటూ ఘాటుగా విమర్శించారు. ఇసుక నుంచి క్రికెట్ బెట్టింగ్ నుంచి యధేచ్ఛగా సాగుతున్న పోలీసులు సైతం అచేతనం అయిపోయారంటూ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలుచేసినప్పుడు.. జగన్ ఆగ్రహించారు.
షోకాజ్ నోటీసు జారీ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే.. తర్వాత పరిస్థితి సద్దు మణిగింది. ఆనం తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక.. నెల్లూరు రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి ఉండటమే కారణమని భావిస్తున్నారు. మరో ఏడాది గడువు ఇస్తున్నానని చెప్పడం వనుక…తర్వాత మార్పు కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని.. సందేశం పంపిచారన్న భావన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆనం వ్యాఖ్యలపై.. వైసీపీ హైకమాండ్ స్పందనేమిటో తెలియాల్సి ఉంది.