ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సిఫార్సుచేయడంతో కేంద్రం అంగీకారం తెలిపింది. కరోనా నేపథ్యంలో సీఎస్ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ సీఎస్ సర్వీస్‌లో కొనసాగనున్నారు. కేంద్రం…ఇటీవలి కాలంలో ఉన్నతాధికారుల సర్వీస్ పొడిగింపును ఆమోదించడం లేదు.
గతంలో టీడీపీ హయాంలో… అజేయకల్లాం చాలా కొద్ది రోజులు మాత్రమే.. సీఎస్‌గా ఉన్నారు. ఆయన పదవి కాలాన్ని పొడిగించాలని అప్పటి చంద్రబాబు సర్కార్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ అసంతృప్తితోనే ఆయన…పదవి విరమణ తర్వాత చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారన్న ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం..కరోనా వైరస్ చర్యలు కీలకం అయినందున… ఈ విధుల్లో పాల్గొంటున్న వారి సర్వీసును కేంద్రం పొడిగిస్తోంది.
ఈ జాబితాలో.. నీలం సహానికి కూడా అవకాశం లభించిందనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నీలం సహాని సీఎస్‌గా.. ఒత్తిడిగా ఎదుర్కొంటున్నారు. రంగుల జీవోల విషయంలో ఇప్పటికే కోర్టు ధిక్కరణ విచారణ ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అదే సమయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. ఇచ్చిన పలు ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి సమయంలో సీఎస్ పొడిగింపు కోరుకోవడం.. ప్రభుత్వం ఆమోదించడం అధికార వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.