ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజీ జరిగింది. ఆ ఘటన కారణంగా అప్పటికప్పుడు పన్నెండు మంది… ఆ తర్వాత మరో ఇద్దరు చనిపోయారు. కానీ.. ఎల్జీ పాలిమర్స్‌లో పని చేసే వారికి చిన్న హాని కూడా జరగలేదు. ఘటన జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న హైలెట్ అవుతోంది. లాక్ డౌన్ తర్వాత ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించడానికే…ఎల్జీ పాలిమర్స్‌ను రీ ఓపెన్ చేశారు.. అంటే పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి ఉంటారని అంచనా వేశారు. కానీ ఎవరికీ అస్వస్థత కలగడం వంటివి జరగలేదు. అసలు ఆ సమయంలో ఎంత మంది కార్మికులున్నారన్నదానిపైనా క్లారిటీ లేదు. కానీ ఎన్జీటీ నియమించిన విచారణ కమిటీలో దీనిపై కాస్త క్లారిటీ వచ్చింది.
ప్రమాదకరమైన స్టైరిన్ ను… సేఫ్‌గా ఉంచడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన కంపెనీ యజమాన్యం.. ప్రమాదం జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో.. సిబ్బందికి తెలియచెప్పలేదు. గ్యాస్ లీక్ అవుతుందని తెలియగానే.. అక్కడి సిబ్బంది… క్రైసిస్ మేనేజ్మెంట్ పాటించలేదు. ఆ గ్యాస్‌ను కట్టడి చేయడానికి చిన్న ప్రయత్నం చేయలేదు. లీక్ అవుతున్నట్లుగా తెలియగానే అక్కడి నుంచి సిబ్బంది మొత్తం పరారైపోయారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చుట్టుపక్కల గ్రామాల వారందర్నీ బలి చేయడానికి ఏ మాత్రం వెనుకాడ లేదు. ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీలో.. సిబ్బంది చేసిన ఘన కార్యం వెలుగులోకి వచ్చింది.
ఎల్జీ పాలిమర్స్.. ఓ ప్రమాదకర రసాయనంతో… ఉత్పత్తులు చేస్తున్నప్పుడు దానికి తగ్గట్లుగా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల్లో కనీసం ఒక్క శాతం కూడా తీసులేదని.. ఎన్టీటీ నిపుణుల కమిటీ రిపోర్ట్ చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. అసలు పాలిస్టైరిన్ ఉత్పత్తులకు అనుమతే లేనప్పుడు… ఆ ముడిపదార్థాన్ని ఎలా విశాఖకు తీసుకు రాగలిగారన్నది మరో కీలకమైన అంశం. ఏపీ సర్కార్ మాత్రం.. తాము ఎలాంటి ఎన్వోసీ ఇవ్వలేదని… ఎన్జీటీకి స్పష్టం చేసింది.అయితే దరఖాస్తు చేసుకున్నారని… చెబుతోంది. అనుమతి ఇవ్వకుండా.. వారెలా ఉత్పాదక కార్యకలాపాలు ప్రారంభించారన్నది మరో కీలకమైన అంశంగా మారింది.