మీరా చోప్రా Vs ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. మీరా చోప్రా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ క్లబ్బుల పేరిట తనకు వస్తున్న అత్యాచార బెదిరింపులు, ట్రోల్స్ పై సైబర్ పోలీసులని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారాన్ని అటు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఇటు తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చింది. అయితే ఈ సమస్యపై జగన్ మిన్నకుండి పోగా, కేటీఆర్ చొరవ తీసుకుని , తెలంగాణ డీజీపి ని ట్యాగ్ చేసి వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈ సమస్యపై స్పందించలేదు.
Ma’m, I have requested @TelanganaDGP and @CPHydCity to take stern action as per law based on your complaint https://t.co/mbKzVAe5fB
— KTR (@KTRBRS) June 5, 2020
వివాదం:
అప్పుడెప్పుడో వచ్చిన “బంగారం ” అనే తెలుగు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్ మీరా చోప్రా ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లినప్పటికీ అక్కడ పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఇటీవల ఆస్క్ మీరా అంటూ ట్విట్టర్లో హీరోయిన్ మీరా చోప్రా నిర్వహించిన కార్యక్రమంలో లో నెటిజన్లు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిప్రాయాన్ని చెప్పమని అడగగా ఆయన ఒక సూపర్ స్టార్ మరియు సూపర్ హ్యూమన్ బీయింగ్ అని జవాబు ఇచ్చింది. అయితే ఆ తర్వాత నెటిజన్లు, జూనియర్ ఎన్టీఆర్ పై తన అభిప్రాయాన్ని తెలపమని అడగగా, ఆయన గురించి తనకు పెద్దగా తెలియదని తాను ఆయన ఫ్యాన్ కాదు అని చెప్పుకొచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కంటే మహేష్ బాబును ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పుకొ చ్చింది. నిజానికి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కంటే షారుక్ ఖాన్ ని ఎక్కువ ఇష్టపడతానని, లేదా అభిషేక్ బచ్చన్ కంటే హృతిక్ రోషన్ ని ఎక్కువ ఇష్టపడతానని చేసే వ్యాఖ్యలు సర్వ సాధారణంగానే ఉంటాయి. కానీ ఇలా హీరోలను పోలుస్తూ చేసే వ్యాఖ్యలు తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో మాత్రం వివాదాలకు కారణమవుతుంటాయి. అయితే ఆ విషయం తెలియక వ్యాఖ్యలు చేసిన మీరాచోప్రా కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కొంతమంది గ్యాంగ్ రేప్ చేసి చంపుతామని బెదిరిస్తూ కూడా వ్యాఖ్యలు చేయడంతో ఆమె వాటిని రీట్వీట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ని అటు సైబర్ పోలీసులని ట్యాగ్ చేసింది. అటు సైబర్ పోలీసుల కి, ట్విట్టర్ కి కూడా ఫిర్యాదు చేసింది.
పబ్లిసిటీ కోసం చేస్తోందంటున్న జూనియర్ అభిమానులు
అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కావాలనే మీరాచోప్రా పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేస్తోందని అంటున్నారు. పైగా ఎవరో ఒకరిద్దరు చేసిన పని మొత్తం అభిమానులకు ఆపాదించడం తప్పని వారు అంటున్నారు. వారి వాదనలో నిజం ఉన్నప్పటికీ కొందరు అభిమానులు ఆమెను గ్యాంగ్ రేప్ చేస్తామని అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న స్క్రీన్ షాట్స్ ని మీరాచోప్రా ట్విట్టర్లోనే చూపించింది. ఆ కొందరు దురభిమానులను కట్టడి చేయవలసిన అవసరం ఉందన్న విషయం లో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన మీరాచోప్రా
ఇటు వంటి ఫ్యాన్స్ మీకు గర్వ కారణం కాదని జూనియర్ ఎన్టీఆర్ కి హితవు పలికింది మీరా చోప్రా. అయితే, ఈ మెసేజ్ ని ఇగ్నోర్ చేయవద్దని దీనిమీద స్పందించమని జూనియర్ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా కోరింది. నిజానికి అభిమానగణం హీరోలకు తలనొప్పిగా పరిణమించడం అన్నది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. అయితే కొన్నిసార్లు అభిమానులు గీత దాటిన పుడు హీరోలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వివాదం జరిగిన రోజునే ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసి దీనిపై స్పందించాల్సిందిగా కోరిన మీరా చోప్రా, తాజాగా ” సామాజిక అంశాలతో సినిమాలు తీసే ఈ స్టార్లు నిజజీవితంలో ఇలాంటి సమస్యలపై స్పందించడకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు” అంటూ మరో ట్వీట్ చేసింది.
Thanks @sanjukta, iam really not scared of these faceless cowards also iam amused by the silence of these stars who otherwise does socially relevant films, but when the same thing happens in real life, that dont say a word!! https://t.co/6ma7hPcyVT
— Meera Chopra Kejriwal (@MeerraChopra) June 5, 2020
సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించడం, ఒక కానీ వీడియో మెసేజ్ ఇవ్వడం ద్వారా కానీ, అభిమానుల కి సందేశం ఇవ్వాలని కోరింది మీరాచోప్రా.
As a socially aware and morally responsible star, @tarak9999 should come out with a tweet and a video message and rein in his fans: @MeerraChopra#JrNTR #MeeraChopra #CyberBullying https://t.co/E5FUeH4qHF
— Hyderabad Times (@HydTimes) June 5, 2020
చిన్మయి తప్ప స్పందించని పరిశ్రమ, తెలుగు మీడియా
మీటూ ఉద్యమ సమయంలో సినీ పరిశ్రమలో వేధింపులకు గురైన స్త్రీల పక్షాన నిలిచిన సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి మరొకసారి మీరాచోప్రా తరఫున నిలబడింది. అయితే ఆవిడ తప్ప సినీ పరిశ్రమ నుండి ఈ సమస్యపై ఎవరూ స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. అంతే కాకుండా ఈ సమస్యపై జాతీయ మీడియాలో జరిగిన చర్చ తో పోలిస్తే తెలుగు మీడియాలో పెద్దగా చర్చ జరగలేదనే చెప్పాలి. తూతూమంత్రంగా స్క్రోలింగ్ లు వేయడం తప్ప ఈ సమస్యని తెలుగు మీడియా ఛానల్స్ ఎందుకని చర్చించలేదని, జబర్దస్త్ షో లో కామెడీ కోసం వాడిన ఒక చిన్న డైలాగ్ మీద శనివారం ఆదివారం కలిపి దాదాపు 10 గంటల పాటు లైవ్ డిబేట్ పెట్టిన టీవీ9 తో పాటు, శ్రీ రెడ్డి సమయంలో రోజుల తరబడి లైవ్ లు ఇచ్చిన చానల్స్ అన్నీ కూడా ఎందుకు ఇప్పుడు మౌనం పాటిస్తున్నాయని అంటూ ఒక వర్గం ప్రేక్షకుల నుండి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
స్పందించిన కేటీఆర్, మిన్నకుండి పోయిన జగన్
మీరా చోప్రా తన మీద వస్తున్న వేధింపులను ఎదుర్కోవడానికి సిద్ధ పడ్డట్టు గా కనిపిస్తోంది. ఈ సమస్యని ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే మీరు చోప్రా ఈ సమస్యని కేటీఆర్ మరియు కవితల దృష్టికి కూడా తీసుకు వచ్చింది. కేటీఆర్ నుండి మీరా చోప్రా విజ్ఞప్తికి వెంటనే స్పందన వచ్చింది. వేధింపులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హామీ కేటీఆర్ నుండి వచ్చింది.
@KTRTRS @RaoKavitha ive been abused of gangrape, acidattack, abused, cyberbullied and slutshamed by your state. @hydcitypolice has filed an fir and i hope for the safety of women this will investigated thoroughly pic.twitter.com/GtIZPEMvqm
— Meera Chopra Kejriwal (@MeerraChopra) June 5, 2020
మొత్తం మీద:
మొత్తం మీద మీరాచోప్రా వ్యవహారం ఇప్పటికైతే ఇంకా సద్దుమణగలేదు అని చెప్పాలి. మరి దీనిపై తారక్ స్పందిస్తాడా అన్నది వేచి చూడాలి