యువ హీరోల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్.. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలు సూపర్ క్రేజ్ తీసుకువచ్చేవే.. అందులో ఒకటి ‘ఒక అమ్మాయి తప్ప’ అని జర్నీ ప్రధాన అంశంతో వస్తున్న సినిమా కాగా నిత్యా మీనన్ తో నటిస్తున్న సినిమా కావడం చేత ఆ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఇక మలయాళ సినిమా నేరం కు రీమేక్ గా సందీప్ చేస్తున్న మరో సినిమా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన నేరం సినిమా తెలుగులో మిస్టర్ నూకయ్య సినిమా డైరెక్ట్ చేసిన అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు.
కొద్దిరోజులుగా మీడియా మిత్రుల సహాయంతో తమ సినిమా టైటిల్ ను ప్రేక్షకులే నిర్ణయించాలని హడావిడి చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఆ సినిమా టైటిల్ ‘రన్’ అని ఫిక్స్ చేశారు. ప్రేక్షకుల నిర్ణయం మేరకే ఈ టైటిల్ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సందీప్ కిషన్ స్వయంగా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయడం విశేషం. మలయాళంలో నేరం అంటే సమయం అనే అర్ధం వస్తుంది. నివిన్ పౌలి, నజరియ జంటాగా నటించిన నేరం అశేష ప్రేక్షకాదరణ పొందింది.
కామెడీ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అదే ఫీల్ తో రూపొందించబడుతుంది. ముందు 123 అనే టైటిల్ పెడదామనుకున్నా ‘రన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. పిక్సెల్ డ్రీమ్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనీల్ సుంకర సమర్పణలో ఈ సినిమా వస్తుండటం విశేషం.