ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ‘క్లైమాక్స్’ సినిమాని విడుదల చేస్తున్నాడు ఆర్జీవీ. ఈ సాయింత్రం నుంచే ఆ రచ్చ మొదలు కానుంది. ఈ సినిమా చూడాలంటే వంద రూపాయలు చెల్లించాల్సివుంటుంది. ఈ వ్యాపారం గిట్టుబాటు అయితే.. ఇక నుంచి ఆర్జీవీ తన సినిమాలన్నీ ఇలానే రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యాడు. అయితే ఈలోగా తన పాత సినిమాలు కొన్నింటిని ఆన్లైన్ ఆప్ద్వారా రీ- రిలీజ్ చేస్తున్నట్టు టాక్. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’,’లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాలు సెన్సార్ సమస్యల్ని ఎదుర్కొని విడుదలయ్యాయి. సెన్సార్ సమయంలో చాలా కీలకమైన సన్నివేశాలు ‘లేచి’ పోయాయి. దాంతో సినిమాలో అసలు మజా పోయింది. ఇప్పుడు అలా సెన్సార్ చేసిన సన్నివేశాలన్నీ జోడించి, సరికొత్త వెర్షన్ని వర్మ విడుదల చేయబోతున్నాడని టాక్. అయితే దీన్ని ఫ్రీగానే చూపిస్తాడట. ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు సినిమాలూ ఆమేజాన్ లో ఫ్రీగానే లభ్యం అవుతున్నాయి. మళ్లీ వాటికో రేటు పెడితే.. కొని చూసేవాడెవడు?