ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మరో కీలకమైన హామీని అమలు చేయాడనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 45 ఏళ్లు దాటిన ప్రతీ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఐదేళ్లలో 75వేల రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ పథకానికి వైఎస్ఆర్ చేయూత అని పేరు పెట్టారు. అయితే తొలి ఏడాది అమలు చేయలేదు. నాలుగేళ్లలో ఈ రూ.75వేల రూపాయలు మహిళలకు పంపిణీ చేయాల్సి ఉంది. నాలుగేళ్లలో ఏడాదికి రూ.18750 చొప్పున మహిళలందరికీ పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆగస్ట్ 12న పథకాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ పథకానికి ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే సంక్షేమ పథకాల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి ప్రకటించారు. దాని ప్రకారం వైఎస్ఆర్ చేయూత విషయంలో అధికారికంగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై జరుగుతున్న సస్పెన్స్‌ను.. కేబినెట్ తెరదించింది. పదహారో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలను జరపాలని నిర్ణయించింది. కేబినెట్ భేటీలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం చర్చించారు. ఐదు దశల్లో రామాయపట్నం పోర్టును నిర్మించాలని.. కేంద్రం నిధుల కోసం ప్రయత్నిస్తూనే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. మొదటి దశలో రూ.4,736 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు నాటికి పోర్టు నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, డిస్కం, ట్రాన్స్‌కోలకు రూ. 6 వేల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ నిధుల ఖర్చు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వైస్సార్ సంపూర్ణ పోషణ, వైస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాలకు కూడా ఆమోదముద్రవ ేశారు. లబ్దిదారులకు ఇవ్వబోతున్న ఇళ్లు కట్టుకున్న ఐదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలనినిర్ణయించారు. రైతులకు త్వరలో 9 గంటలు ఉచిత విద్యుత్, గండికోట రిసర్వాయిర్ లో పూర్తి సామర్ధ్యం నిల్వకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. టీటీడీ లో సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు.