ప్రముఖ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా బారీన పడ్డారు. గత రెండురోజులుగా ఆఫ్రిది అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలిందని పాక్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో ఆఫ్రిది చికిత్స పొందుతున్నారని సమాచారం.
ఆఫ్రిదితో పాటు క్రికెటర్లు తౌఫీర్ ఉమర్, జఫర్ సర్ఫరాజ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ తెలుస్తోంది. ఈ వార్త క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. మరింత మంది క్రీడాకారులకు కరోనా పరీక్షలు చేయాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఆఫ్రిదికి కరోనా సోకిందన్న విషయం తెలియగానే.. భారత క్రికెట్ ప్రపంచంలోనూ గుబులు మొదలైంది. త్వరలో ఐపీఎల్, టీ 20 ప్రపంచకప్‌కి ఐసీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ సమయంలో ఇలాంటి వార్త.. షాక్ ఇచ్చేదే. ముందు ఆటగాళ్ల ఆరోగ్యం ముఖ్యం. ఆ తరవాతే.. క్రీడలు. అందుకే క్రీడల విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాల్సివుంది.