ప్రపంచం మొత్తం కరోనాకు వ్యాక్సినో.. మందో కనిపెట్టాలని .. వేల కోట్లు వెచ్చింది.. లక్షల మంది వైద్య నిపుణులు ల్యాబుల్లో బయట ప్రపంచం చూడకుండా… కష్టపడుతున్నారు. కానీ వారందరి కంటే ముందే ఇండియాలో మందు కనిపెట్టేశారు.. ఎవరో కాదు.. మన యోగా గురువు రామ్‌దేవ్‌బాబా. ఆయనకు చెందిన పతంజలి సంస్థ … కరోనాను ఐదు నుంచి పధ్నాలుగు రోజుల్లో తరిమికొట్టే మందుని తయారు చేసిందట.. క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయట. ఈ మందు వివరాలను…ఎలా సక్సెస్ అవుతుందో.. నాలుగు రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెడతారట. అయితే… పతంజలి సంస్థ తయారు చేసే మందు ఆయుర్వేదంది.
దానికి ఐసీఎంఆర్ లాంటి సంస్థల అనుమతులు.. సర్టిఫికేషన్లు అవసరం లేదు. తీసుకోరు కూడా. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారికి ఆయుర్వేదం ద్వారా ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చని తాము ఆధారాలతో సహా ముందు ఉంచుతామని పతంజలి వ్యవహారాలు చూస్తున్న బాలకృష్ణన్ ప్రకటించారు. ఐదేళ్ల కిందటి వరకూ.. సాదాసీదా కంపెనీగా ఉండే పతంజలి.. ఆ తర్వాత… ఒక్క సారిగా బూమ్‌లోకి వచ్చింది. గోధుమ పిండి సహా.. అన్ని రకాల రోజువారీ వినియోగవస్తువులను మార్కెట్లోకి తెచ్చింది. కానీ అది పాలపొంగులా మారిపోయింది. డిమాండ్ అమాంతం పడిపోయింది.
గత ఏడాది పతంజలికి వెయ్యి కోట్ల వరకూ నష్టాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు కరోనా మందుతో.. ఆ నష్టాలన్నింటినీ పూడ్చేసుకుని మళ్లీ దూసుకెళ్లాలని పతంజలి ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు. ఆయుర్వేదం అని చెబుతున్నారు కాబట్టి.. ప్రజల నమ్మకాలు.. భయాలను బట్టి మార్కెట్ చేసుకోవడమే. ప్రస్తుతం కరోనాపై ఉన్న పానిక్ వాతావరణంతో… పతంజలి… అనుకున్నది సాధించినా ఆశ్చర్యం లేదు మరి..!