సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది. చిన్న వయసు, ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడు. సడన్‌గా ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోవడం జీర్ణించుకోలేని విషయం. సుశాంత్‌కి అన్ని కష్టాలేం ఉన్నాయంటూ… బాలీవుడ్లో ఆరా మొదలైంది. సరిగ్గా 5 రోజుల క్రితం సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతి సుశాంత్‌ని బాగా కలచి వేసిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఇప్పుడు ఆ కోణంలోంచి దర్యాప్తు మొదలెట్టారని తెలుస్తోంది. సుశాంత్ సినిమా దిల్ బేచారా మేలో విడుదల కావల్సింది. లాక్ డౌన్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. వాటికి సంబంధించిన సమస్యలు కూడా సుశాంత్‌ని చుట్టి ముట్టాయా? అనే కోణంలోనూ అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.
సుశాంత్ మృతిని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ‘ఈ వార్త నిజం కాదు’ అంటూ అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు. ‘సుశాంత్ నటించిన చిచ్చోరే చూశాను. ఆ సినిమాలో నేనెందుకు భాగం కాలేదని బాధ పడ్డాను. సుశాంత్ ప్రతిభ ప్రత్యేకమైనది. తనకు చాలా భవిష్యత్తు ఉందనుకున్నా’ అంటూ భావోద్వేగభరితంగా ట్వీట్ చేశారు అక్షయ్ కుమార్.