తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని నెలల పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సగం జీతాలు… పెన్షనర్లకు కేవలం 75 శాతం మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఎవరూ ప్రశ్నించకుండా.. ఓ చట్టం కూడా తీసుకు రావాలని నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. రాత్రికి రాత్రి.. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను సిద్ధం చేసిన ప్రభుత్వం.. గవర్నర్‌తో ఆమోదముద్ర కూడా వేయించుకుంది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను తగ్గించడం కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరుపుతున్న సమయంలో.. పెన్షన్లను తగ్గించడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలేమిటో చెప్పాలని ఆదేశించింది.
ఈ ఆదేశాలు వచ్చిన ఒక్క రోజులోనే.. ప్రభుత్వం.. అలాంటి అధికారాలు తమకు దఖలు పర్చుకుంటూ.. ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. కేసీఆర్ సర్కార్ తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. విపత్తుల సమయంలో.. జీతాలు, పెన్షన్లు తగ్గించి ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని.. స్పష్టం చేసింది. అంటే.. న్యాయస్థానాలు సహా.. ఎవరూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించలేరన్న మాట. గత మూడు నెలలుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే వస్తోంది. వైద్య సిబ్బంది, పోలీసులకు మాత్రం పూర్తి జీతాలొస్తున్నాయి. మిగతా అందరికీ కోతలు పెడుతున్నారు.
రెండు నెలల పాటు ఏపీ సర్కార్ సగం జీతాలే ఇచ్చినా.. ఈ నెల నుంచి పూర్తి జీతాలు ఇస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. కోతలను మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఎవరూ ప్రశ్నించకుండా.. నేరుగా చట్టం తీసుకొచ్చేస్తోంది. ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా మెరుగుపడిన తర్వాత… మద్యం అమ్మకాలు కూడా ప్రారంభమయిన తర్వాత ప్రభుత్వం మొత్తం జీతాలు ఇస్తుందేమోనని… ఉద్యోగులు ఆశ పడుతున్నారు. కానీ… వారి ఆశలు.. మరికొన్ని నెలల పాటు నెరవేరే అవకాశం లేదని.. కేసీఆర్ తేల్చేశారు. కేరళలో కూడా… ప్రభుత్వం ఇలాగే జీతాల్లో కోతలు విధించాలనుకుంది. కానీ అక్కడ ఆ జీవోను కొట్టి వేయడంతో… అక్కడి ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఆ బాటలోనే తెలంగాణ సర్కార్ పయనించింది.