శాసనమండలిలో గతంలో జరిగిన సన్నివేశాలే దాదాపుగా మళ్లీ రిపీటయ్యాయి. గతంలో.. సీఆర్డీఏ రద్దు బిల్లు, మూడురాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపేటప్పుడు… జరిగిన ఘటనలే ఇప్పుడూ జరిగాయి. చైర్మన్ చైర్ చుట్టూ… వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్సీలు చుట్టు ముట్టగా.. కొంత మంది.. కింది ఉన్న టీడీపీ ఎమ్మెల్సీలపై దాడికి దిగారు. అప్పట్లాగే.. ఈ సారి కూడా.. శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. సీక్రెట్‌గా పని కానిచ్చేయాలని అనుకున్నారు.
రూల్ నెంబర్ 90 కింద… గతంలో సెలక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లినా.. కొత్తగా బిల్లులు పంపారని.. వాటిని ప్రవేశ పెట్టాల్సిన అవసరం లేదని.. టీడీపీ ఎమ్మెల్సీలు నోటీసులిచ్చారు. కానీ.. వైసీసీ సభ్యులు చర్చకు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వలేదు. యనమల రామకృష్ణుడు చర్చను ప్రారంభించారు. దీన్ని సభ్యులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు పరస్పరం ఘర్షణకు దిగారు. చైర్మన్ సీట్లో ఉన్న డిప్యూటీ చైర్మన్ ఈ గందరగోళం మధ్య.. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో వైసీపీ సభ్యులు.. రెడ్డి సుబ్రహ్మణ్యం మీదకు దూసుకెళ్లారు.
ఆ సమయంలో లోకేష్ చేతుల్లో సెల్ ఫోన్ ఉండటంతో.. రికార్డు చేస్తున్నారన్న ఉద్దేశంతో..మంత్రి వెల్లంపల్లి లోకేష్‌పైకి దూసుకెళ్లారు. మరో మంత్రి కన్నబాబు.. ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు కూడా.. అదే ప్రయత్నం చేశారు. లోకేష్ చేతుల్లోని సెల్‌ఫోన్‌ను లాగేసుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలను టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, మంతెన సత్యన్నారాయణ రాజు అడ్డుకున్నారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారని.. ఆ ప్రక్రియ కొనసాగించాలి అని రూల్ 90 నోటీసు ఇచ్చారు. రూల్ 90 నోటీసు ని అడ్మిట్ చేసుకొని సభని నిరవధిక వాయిదా వేశారు. ఈ పరిణామంతో.. రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లినట్టేనని టీడీపీ సభ్యులు చెబుతున్నారు.
సభలో వైసీపీ సభ్యులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. ముందు ద్రవ్యవినిమయ బిల్లు పాస్ చేయమని అడిగామని కానీ.. కొందరు అయితే తొడగొట్టారని, ఒకరు ఫాంట్ జిప్ తీయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. వాస్తవాలు తెలియాలంటే.. దాడి చేసిన విజువల్స్‌ను టైంతో సహా బయట పెట్టాలని టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.