అసెంబ్లీలో ఆమోదం పొందిన బడ్జెట్.. శానసమండలిలో ఆమోదం పొందలేదు. ఏ ప్రభుత్వం అయినా ముందుగా ద్రవ్య వినిమయ బిల్లుకు ప్రాధాన్యం ఇచ్చి ఆమోదం పొందుతుంది. శాసనమండలిలో నిన్న మొదట… అధికార పార్టీ సభ్యులు.. ద్రవ్య వినిమయ బిల్లులు ముందు వద్దే వద్దని… సీఆర్డఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లు పెట్టాలంటూ.. హంగామా సృష్టించారు. అయితే.. తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రం ముందుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిపి ఆమోదిద్దామని పిలుపునిచ్చారు. కానీ.. వైసీపీ సభ్యులు అంగీకరించలేదు. దీంతో అనూహ్యమైన పరిణామాలు జరిగి.. మండలిని నిరవధిక వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే.. ఈ క్రమంలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు.
బడ్జెట్ ఆమోదం పొందకపోతే… ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. గతంలో ఓటాన్ అకౌంట్ రూపంలో.. గవర్నర్ నుంచి నాలుగు నెలల పాటు ఆర్డినెన్స్ రూపంలో తెచ్చుకుని ఖర్చు పెడుతున్నారు. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. అంటే… ఒకటో తేదీ నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఎవరికీ చెల్లించడానికి అవకాశం లేదు. అయితే.. ద్రవ్య వినిమయ బిల్లు.. శానసమండలిలో ప్రవేశపెట్టామని.. ఆమోదించినా.. ఆమోదించకపోయినా… పధ్నాలుగు రోజుల్లో చట్టంగా మారుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అలా చూసినా… పధ్నాలుగు రోజుల సమయం లేదు. పైకా కొత్త సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
ప్రస్తుతం.. ఇప్పుడు మళ్లీ మండలి సమావేశాలకు నోటిఫికేషన్ ఇచ్చి ద్రవ్య వినియమ బిల్లును ఆమోదింప చేసుకోవడమో.. లేక… పధ్నాలుగు రోజుల నిబంధనకు అనుగుణంగా… వచ్చే నెల రెండు లేదా.. మూడో తేదీన బిల్లు ఆమోదం పొందిందని అడ్వాంటేజ్ తీసుకుని గవర్నర్ సంతకం కోసం పంపించడమో చేయాలి. ఎలా చూసినా… ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితే. జీతాలు, పెన్షన్లు.. వచ్చే నెల ఒకటో తేదీన ఇవ్వాలంటే.. మొదటి ఆప్షన్ తీసుకోవాలి. లేకపోతే.. కొన్నాళ్ల పాటు ఆగాల్సి ఉంటుంది. ప్రభుత్వం తమ ప్రాధాన్యతాంశాలను ఎంపిక చేసుకోవడంలో తడబటడటంతో ఇలాంటి రాజ్యాంగ సంక్షోభం తరహా పరిస్థితులు తలెత్తుతున్నాయన్న అభిప్రాయం.. ఏర్పడుతోంది.