తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని.. ప్రధానమంత్రి మోడీ వీడియో కాన్పరెన్స్‌లో కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలోనే… ఇటు హైకోర్టు.. కరోనాపై కాడి దించేశారా అని అధికార యంత్రాంగంపై విరుచుకుపడింది. కరోనా పరీక్షలు.. సిబ్బందికి పీపీఈ కిట్లు సరఫరా చేయకపోవడం..తగినన్ని కోవిడ్ ఆస్పత్రులు, వైద్య సిబ్బందికి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై.. ప్రశ్నల వర్షం కురిపిస్తంది. 72 మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. 400 మంది సిబ్బంది క్వారంటైన్లో ఉన్నారని.. కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి క్రమంగా పట్టు తప్పినట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది., అంతే కాదు మీ ప్రాణాలను మీరే రక్షించుకోండంటూ కాడి వదిలేసినట్లుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా కట్టడి పరిస్తితులు… చికిత్స ఏర్పాట్లపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ వివరమ ఇవ్వాలని ఆదేశించింది.
కరోనా విషయంలో హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటి సారి కాదు. టెస్టులు నిలిపివేయడంపై కొన్ని రోజుల కిందట ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు చేయకుండా.. కొన్ని చోట్ల గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. ఈ పరిణామంపై కొంత మంది నేతలు కోర్టుకెళ్లారు. దీంతో పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత చనిపోయిన వారికి కూడా కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. తాము ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే టెస్టులు చేస్తున్నామని.. మృతదేహాలకు టెస్టులు చేయడం కుదరదని వాదిస్తూ… తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ ఉత్తర్వులపై స్టే తీసుకు వచ్చింది.
కరోనా టెస్టులపై హైకోర్టు మల్లీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే 10 రోజుల్లో 50 వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో తక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వం కరోనా విషయంలో.. ఏ ఆలోచన ఉందో కానీ… కట్టడి చర్యలను తగ్గించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెస్టులను తగ్గించేయడం… సడలింపులు ఇవ్వడంతో.. కరోనాతో కలిసి జీవించాలనే సందేశాన్ని ప్రజలకు పంపినట్లుగా భావిస్తున్నారు. అయితే.. హైకోర్టు మాత్రం. … కరోనా టెస్టులు… వైద్య సిబ్బందికి మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం.. ప్రభుత్వాన్ని వదిలి పెట్టడం లేదు.