మెగా డాటర్ నిహారిక పెళ్లి కుదిరింది. రేపు ఈ శుభవార్త ప్రకటించే ఛాన్సుందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ముద్ద పప్పు – ఆవకాయ్…. లాంటి వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంది నీహారిక. ఆ తరవాత `ఒక మనసు`తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో నటించింది కానీ, విజయాలు అందలేదు. ఎప్పటిలా.. వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఓ హీరోతో.. నిహారిక ప్రేమలో ఉందన్న వార్తలు ఎక్కువగా వినిపించేవి. అయితే వాటి గురించి నిహారిక ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు ఇంట్లో నిహారికకు ఓ సంబంధం ఖాయం చేశారు. పెళ్లికొడుకుది గుంటూరు అని తెలుస్తోంది. ముహూర్తాలు కూడా పెట్టేశార్ట. ఆ విషయాలన్నీ… నాగబాబు కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రకటించే ఛాన్సుందని తెలుస్తోంది.