తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు… ఓ అపరిచితుడు ఫోన్ చేసి చెప్పడంతో కలకలం రేగింది. ప్రస్తుతం చెన్నైలోని రజనీ నివాసంలో పోలీసులు సోదాలు జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం రజనీ ఇంటికి ఓ అపరిచితుడు ఫోన్ చేసి, ఇంట్లో బాంబు పెట్టినట్టు బెదిరించడంతో, వెంటనే రజనీకాంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి, రజనీ ఇంట్లో సోదాలు మొదలెట్టారు. ఫోన్ చేసిన వ్యక్తి వివరాల్ని సేకరిస్తున్నారు. డాగ్ స్వ్వాడ్, బాంబ్ స్వ్కాడ్ కూడా రంగంలో దిగి సోదాల్ని ముమ్మరం చేసింది. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ అభిమానులు రజనీ ఇంటికి చేరుకుంటున్నారు. వాళ్లని అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన పని అవుతోంది.