అంధాధూన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ చిత్రంలో ఓ నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉంది. కథలో చాలా ముఖ్యమైన పాత్ర అది. హిందీలో టబు చేసింది. తెలుగులో శిల్పా శెట్టిని ఎంచుకున్నారు. నిజానికి సౌత్ ఇండియన్ టచ్ ఉన్న నటి కోసం చిత్రబృందం అన్వేషించిందని టాక్. ఓ దశలో ఇలియానా పేరు కూడా పరిశీలించార్ట. ఇలియానాని సంప్రదిస్తే…నిర్మొహమాటంగా `నో `చెప్పేసిందని టాక్. ఇటీవల ఇలియానా బాగా బొద్దుగా మారింది. మళ్లీ కాస్త స్లిమ్ అవ్వడానికి ఇలియానా శతవిధాలా ప్రయత్నిస్తోందట. పైగా నెగిటీవ్ టచ్ ఉన్న పాత్ర చేయనని చెప్పుకొచ్చిందట.
గత కొంతకాలంగా సౌత్ ఇండియాలో గ్రాండ్ రీ ఎంట్రీ కోసం ఇలియానా ఎదురు చూస్తోంది. అంధాధూన్ ఒప్పుకుంటే, ఇలియానాకు ప్లస్ అయ్యేది. ఆ పాత్రలో ఇలియానా కనిపిస్తే.. బాగుండేది కూడా. ఓ రకంగా చెప్పాలంటే శిల్పాశెట్టి కంటే ఇలియానా బెటర్ ఆప్షన్ అయ్యేది. కానీ.. సింపుల్గా నో చెప్పేసింది.