పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్… ‘జగనణమన’. మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తానని గతంలో ప్రకటించాడు పూరి. అప్పట్లో మహేష్ కూడా రెడీ అన్నాడు. కానీ సమీకరణాలు మారాయి. పూరి వరుస ఫ్లాపుల్లో ఉండడం చూసిన మహేష్.. ఓ ఛాన్స్ ఇవ్వడానికి సంచాయించాడు. ఇప్పుడు పూరి హిట్స్లోకి వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో తన ఫామ్ చూపించాడు. `జనగణమన` కథని.. పాన్ ఇండియా రేంజ్లో తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కానీ హీరో మాత్రం మహేష్ కాదు. ఓ బాలీవుడ్ స్టార్‌తో పూరి ఈ సినిమా పట్టాలెక్కించబోతున్నాడు. ఆమధ్య కరణ్ జోహార్‌కి పూరి లైన్ చెప్పాడట. అది కరణ్‌కి బాగా నచ్చి ‘హిందీలో ఓ స్టార్ హీరోతో ఈ సినిమా చేద్దాం. స్క్రిప్టు రెడీ చేయ్’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ లాక్ డౌన్ సమంయంలో పూరి `జనగణమన` స్క్రిప్టుపైనే దృష్టి పెట్టాడు. ఆ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. త్వరలోనే హిందీలో ఓ యువ హీరోకి ఈ కథ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాడు పూరి. ‘జగనణమన నా డ్రీమ్ ప్రాజెక్టు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది’ అంటూ పూరి కూడా ఈ ప్రాజెక్టుపై మనసు విప్పాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓసినిమా చేస్తున్నాడు పూరి. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. ఇది గనుక వర్కవుట్ అయితే… పూరి తదుపరి సినిమా `జగనణమన` అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.