సినిమా హిట్ ఫ్లాప్ అనేది దర్శకుల సృజనను బట్టి ఉంటుంది.. ఒక్కోసారి సినిమా ఎలా ఉన్నా ఆడియెన్స్ మైండ్ సెట్ తో సంబంధం లేకుండా సూపర్ హిట్ అవుతాయి. అయితే దాదాపు 85 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా రిలీజ్ కు ముందు సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయడం గొప్ప విషయం. చేస్తున్న సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలనే చేస్తారు కాని అదే నమ్మకం కథ కథనాల్లో కూడా కనిపించాలి.. ప్రస్తుతం ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ దర్శకుడు ఈ కోవకే వస్తాడు.
అందాల రాక్షసితో దర్శకుడిగా పరిచయమైన హను రాఘవపూడి ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ శుక్రవారం రిలీజ్ అయిన నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మొదటి షో నుండే సూపర్ హిట్ అనేస్తున్నారు. మొదటి సినిమాలో లభించని సక్సెస్ మజాని ఈ సినిమా అందించడం పట్ల సంతోషంగా ఉన్నాడు హను రాఘవపూడి. అంతేకాదు తను తీసుకున్న కథ కథనాలు అదే స్క్రీన్ పై చూపించిన విధానం అందరిని ఇంప్రెస్ చేస్తుంది.
ఇలా.. చేస్తున్న సినిమా మీద నమ్మకం ఉండటం చాలా తక్కువ మంది కనబడుతారు.. ప్రచారం కోసం మా సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అనేస్తారు కాని అది జరుగదు.. అయితే హను రాఘవపూడి మాత్రం సినిమా హిట్ కంపల్సరీ అన్నాడు హిట్ కొట్టి చూపించాడు. ఈ కోవలో హను రాఘవపూడిని దర్శక దిగ్గజుడు రాజమౌళితో పోల్చినా తప్పులేదనిపిస్తుంది. అందుకే టాలీవుడ్ కి మరో రాజమౌళి లాంటి దర్శకుడు దొరికాడని అనుకుంటున్నారు.