మ‌హేష్ సినిమాలో.. నివేదా?

మ‌హేష్ బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. మ‌హేష్ పుట్టిన రోజున ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. ఆగ‌స్టు – సెప్టెంబ‌రులో షూటింగ్ మొద‌ల‌య్యే ఛాన్సుంది. ప్ర‌ధాన కథానాయిక‌గా కీర్తి సురేష్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇందులో మ‌రో క‌థానాయిక‌కీ చోటుంద‌ట‌. ఆ పాత్ర‌లో నివేదా థామ‌స్ న‌టిస్తుంద‌ని టాక్‌. నివేదా చేతిలో కొన్ని హిట్స్ ఉన్నాయి. ఇటీవ‌ల బ్రోచేవారెవ‌రురాతో మంచి హిట్టు కొట్టింది నివేదా. `జై ల‌వ కుశ‌`లో ఎన్టీఆర్ తోనూ న‌టించింది. అయితే బిగ్ లోకి మాత్రం చేర‌లేక‌పోయింది. స్టార్ హీరోల సినిమాలో అవ‌కాశాలు వ‌చ్చినా, చెప్పుకోద‌గిన పాత్ర‌లు ద‌క్క‌క‌పోవ‌డంతో నివేదా పాపుల‌ర్ అవ్వ‌డం లేదు. అయితే ఈసారి మ‌హేష్ సినిమాలో త‌న‌కి మంచి పాత్ర ద‌క్కింద‌ని, ప్ర‌ధాన నాయిక కాక‌పోయినా, ఆ స్థాయిలో మెప్పించే అవ‌కాశం ఈ సినిమాతో ద‌క్క‌బోతోంద‌ని స‌మాచారం. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌బోతున్నాడు. ఇది వ‌ర‌కే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొద‌లైపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close