తెలుగు సాహితీ ప్రపంచంలో మధుబాబు ‘షాడో’ నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. త్రివిక్రమ్ లాంటి దర్శకులు షాడో నవలలకు వీరాభిమానులు. ఇప్పుడు ఈ నవలలన్నీ దృశ్యరూపంలోకి రానున్నాయి. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ నవలల్ని వెబ్ సిరీస్ గా మలచబోతోంది. షాడో పేరుతో దాదాపు 50 నవలల వరకూ వచ్చాయి. వాటిలలో ఉత్తమమైనవి ఎంచుకుని, వెబ్ సిరీస్ గా రూపొందిస్తారు. షాడో గా ఓ పేరున్న కథానాయకుడే తెరపై కనిపిస్తాడని టాక్. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. బడ్జెట్లు కూడా ఖరారైపోయాయి. త్వరలోనే నటీనటుల్ని ప్రకటించి, ఈ ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈమధ్యే కదీర్ బాబు `మెట్రో` కథల్ని ఆహా.. వెబ్ సిరీస్ గా తీస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు `షాడో` వంతు వచ్చింది. ఓటీటీ వల్ల పాత కథలకు, నవలలకు మంచి గిరాకీ ఏర్పడినట్టైంది.