బిగ్ బాస్ కొత్త సీజన్‌కి హోస్ట్ గా సమంత ని ఎంచుకున్నట్టు… ఓ వార్త గట్టిగా షికారు చేస్తోంది. నిజానికి బిగ్ బాస్ 4కి హోస్ట్‌గా నాగార్జున ఎప్పుడో ఫిక్సయ్యారు. తాజాగా సమంత పేరు చూసి అవాక్కయ్యారు సినీ జనాలు. సమంత గనుక చేస్తే… ఈ షోకి కొత్త గ్లామర్ వస్తుందని ఆశించారు.
అయితే.. బిగ్ బాస్ లో సమంత కనిపించడం `బిగ్` జోక్ అంటూ… `బిగ్ బాస్` నిర్వాహకులు తేల్చేశారు. అసలు ఆ ప్రతిపాదనేదీ రాలేదని టాక్. సమంత చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. కొత్త సినిమాల్ని ఒప్పుకోవడానికి సమంత ఏమాత్రం ఇష్టపడడం లేదు. అలాంటప్పుడు బిగ్ బాస్‌కి హోస్ట్ గా ఎందుకు కనిపించాలనుకుంటుంది? సమంత తెలుగు అంతంత మాత్రమే. ధారాళంగా మాట్లాడడం ఇంకా నేర్చుకోలేదు. బిగ్ బాస్ హోస్ట్ గా మెప్పించాలంటే… స్థానిక భాషలో పట్టు అవసరం. నాని, ఎన్టీఆర్, నాగార్జున.. ఈ ముగ్గురూ తెలుగులో ప్రావీణ్యం ఉన్నవాళ్లే. అందుకే హోస్టులుగా రాణించారు. ఈ విషయంలో సమంత వెనుకబడే ఉంటుంది. కాబట్టి.. సమంతని బిగ్ బాస్ హోస్ట్‌గా తీసుకునే ఛాన్సే లేదు. సమంత కూడా ఈ న్యూస్‌ని చాలా లైట్ తీసుకుందని, అందుకే సోషల్ మీడియా వేదికగా ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.