ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసుల్లో అంబులెన్స్‌లే ప్రాణదాతలు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడో… హఠాత్తుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడో… అంబులెన్స్‌లు క్షణాల్లో వస్తే నిలబడే ప్రాణాలు ఎక్కువ. అందుకే.. ఏపీ ప్రభుత్వం కొత్త అంబులెన్స్‌ను భారీ ఎత్తున ప్రవేశ పెడుతోంది. 108 నూతన అంబులెన్స్ లను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ బెంజ్ సర్కిల్లో అట్టహాసంగా జరిగే కార్యక్రమంలో వీటిని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. రూ. 203 ఖర్చుతో వీటిని కొనుగోలు చేశారు. వీటి నిర్వహణ కోసం… రూ. 800కోట్లకుపైగా ఖర్చు చేయబోతున్నారు. అరబిందో ఫౌండేషన్ సంస్థ.. ఈ బాధ్యతలను దక్కించుకుంది.
ప్రతీ మండలానికి ఒక 104 వాహనాన్ని కేటాయించారు. కొత్త 104 వాహనాలు 676 ఉన్నాయి. 108 వాహనాలు 412 ఉన్నాయి. కొత్త అంబులెన్స్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. వాహనంలోనే డాక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. న్నపిల్లలకు సైతం ప్రమాదం జరిగితే తక్షణ అత్యవసర వైద్య చికిత్సలు అందించే నియోనాటల్ కేర్ ఏర్పాట్లు కూడా వాహనాల్లో చేస్తున్నారు. 104, 108 వాహనాలు ఒకేసారి వెయ్యి అందుబాటులోకి వస్తూండటంతో … కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు మరింత మేలు చేయడానికి అవకాశం ఉంటుంది.
108 సర్వీసులు… సక్రమంగా తిరిగితే.. కొన్ని వందల ప్రాణాలు నిలబడతాయి. కేవలం వాహనం ఉంటే సరిపోదు.. అందులో ఆక్సీజన్ సహా.. అన్ని రకాల మెడికల్ ఎమర్జెన్సీ కిట్స్ ఉండాలి. లేకపోతే.. ఆ వాహనాల వల్ల ఉపయోగం ఉండదు. కానీ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవన్న కారణంగా చాలా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ఫలితంగా.. ఫోన్ చేసిన తర్వాత అంబులెన్స్ వచ్చే సమయం పెరగడం… అలాగే లైఫ్ సపోర్ట్ ఇచ్చే సౌకర్యాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు గత సర్వీస్ ప్రొవైడర్ కన్నా భారీ మొత్తంలో ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. ఇప్పుడైనా పరిస్థితి మెరుగుపడుతుందేమోనని ప్రజలు భావిస్తున్నారు.