రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయించడమే లక్ష్యంగా వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా.. ఇద్దరు ఎంపీల్ని ఢిల్లీ పంపింది. ఆ ఇద్దరు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌తో పాటు.. కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు. రఘురామకృష్ణంరాజు చేస్తున్న ఫిర్యాదులు.. ఆయనపై క్రమశిక్షణా చర్యలపై వివరణ ఇవ్వడం … చర్చించడం చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు ఎంపీల్లో విజయసాయిరెడ్డి లేరు. వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ తరపున ఢిల్లీ అంటే విజయసాయిరెడ్డి.. విజయసాయిరెడ్డి అంటే ఢిల్లీ. ఆయన పార్లమెంటరీ పార్టీ నేత… అంతే కాదు.. ఏపీ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి కూడా. ఢిల్లీలో ఎలాంటి కార్యకలాపాలు చక్కబెట్టాలన్నా ముందు ఉండేది ఆయనే. కానీ అనూహ్యంగా రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం.. ఎంపీ బాలశౌరిని ముందు పెట్టారు.
విజయసాయిరెడ్డికి ఇటీవల పార్టీలో సానుకూల పరిస్థితులు లేవన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో.. ఆయన బయటకు కనిపించే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు వారంలో రెండు రోజులు విశాఖలో ప్రెస్మీట్లు పెట్టేవారు. ఇతర పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఇప్పుడు మాత్రం అవేమీ కనిపించడం లేదు. పైగా ఆయన ఢిల్లీ పరపతి కూడా.. తగ్గిపోయిందని… తాజా పరిణామాలతో స్పష్టమైందని వైసీపీలోని వర్గాలు… ముచ్చటించుకుంటున్నాయి. విజయసాయిరెడ్డిపై వైసీపీ హైకమాండ్‌కు నమ్మకం తగ్గిపోయిందనడానికి ఇంత కన్నా… కారణాలేమి కావాలని అంటున్నారు.
అంతకు ముందు.. పార్టీలో ఏదైనా విజయసాయిరెడ్డినే. క్యాడర్ మొత్తం ఆయన వెంటే తిరిగేది. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డితో ఆయనకు దూరం పెరిగిందనే ప్రచారం ప్రారంభం కాగానే.. పార్టీ నేతలు కూడా.. ఆయనతో కాంటాక్ట్స్ తగ్గించేసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ.. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇతర అంశాల్లో… విజయసాయిరెడ్డిని సంప్రదిస్తున్న పార్టీ నేతలు కూడా తగ్గిపోయారు. ఈ వ్యవహారం వైసీపీలో .. హాట్ టాపిక్‌గా మారుతోంది.