వైఎస్ఆర్ అనే పేరును.. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకోవద్దంటూ… అన్నవైఎస్ఆర్ పార్టీ నాయకులు.. ఢిల్లీలో నేరుగా ఎలక్షన్ కమిషన్‌కే వినతి పత్రం సమర్పించారు. రఘురామకృష్ణంరాజుకు తనకు విజయసాయిరెడ్డి జారీ చేసిన షోకాజ్ అంశం చెల్లదంటూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో.. నోటీసు ఇచ్చారని..అది వేరే పార్టీ అని వాదిస్తున్నారు. ఇదే అంశాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ సమయంలోనే అన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెరపైకి వచ్చారు. నేరుగా ఢిల్లీ చేరుకుని…జగన్ నేతృత్వంలోని పార్టీపై ఫిర్యాదు చేశారు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వాడుతున్నారని… ఎస్ఆర్ అనే పదాన్ని ఇతర పార్టీ పేర్లలో వాడకుండా చూడాలని ఆయన ఎన్నికల సంఘాన్నికోరారు. వైఎస్సార్ అనే పదంతో రిజిస్ట్రీ అయిన ఒకే ఒక్క పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఆ పార్టీ అధ్యక్తుడు మహూబ్ బాషా వాదిస్తున్నారు. వైసీపీ వఅధికార పత్రాలపై పూర్తి పేరు వాడకుండా వైఎస్ఆర్ అని రాయడంపై ఎన్నికల సంఘం ఎదుట అభ్యంతరం వ్యక్తం చేశామని.. ఓ ఎంపీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో వైఎస్ఆర్ అని రాయడంతో అది మా పార్టీది అని కొందరు అనుకుంటున్నారని మహబూబ్ భాషా చెప్పుకొచ్చారు.
గతంలోనే ఈసీ పలుమార్లు వైఎస్ఆర్ అనే పేరు వాడవద్దని సూచనలు పంపిందని… అయినా వైసీపీ వాడుతోందని..అందుకే.. జగన్ నాయకత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. ఉందో లేదో తెలియని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన లేఖ ద్వారా రఘురామకృష్ణంరాజు తెరపైకి తీసుకు వచ్చారు. వారు ఇప్పుడు వైసీపీ నేతలు వైఎస్ఆర్ పేరు ను వాడుకోకుండా.. ఈసీ దగ్గరే పిటిషన్లు వేస్తున్నారు.