తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుండగా…హడావుడిగా ఆయనను..డిశ్చార్జ్ చేసేశారు వైద్యులు. గుట్టుగా ఆయన డిశ్చార్జ్ పత్రాలను రెడీ చేసి… హఠాత్తుగా ఆయనను రిలీజ్ చేసి.. సబ్ జైలుకు తరలించారు. అచ్చెన్నను డిశ్చార్జ్ చేయబోతున్న విషయం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున టీడీపీ నేతలు..కార్యకర్తలు గుంటూరు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారందర్నీ నిలువరించిన పోలీసులు ఆస్పత్రి నుంచి జైలుకు తరలించారు. అంతకు ముందు.. తనకు కరోనా టెస్ట్ చేయాలని… జీజీహెచ్ చీఫ్‌గా అచ్చెన్న లేఖ రాశారు. కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదని.. కరోనా పరీక్ష చేయకుండా జైలు అధికారులు అనుమతించరని.. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలని లేఖలో కోరారు. అయితే ఆ లేఖను వైద్యులు..పట్టించుకోలేదు.
వాస్తవానికి ఏసీబీ కోర్టు కస్టడీకి ఇచ్చిన రోజునే..అర్థరాత్రి ఆయనను డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడే అంబులెన్స్‌లు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ కోర్టు ఆస్పత్రిలోనే ఆయనను ప్రశ్నించాలని ఆదేశించడంతో…హడావుడిగా డిశ్చార్జ్ చేస్తే..కోర్టు ధిక్కరణ అవుతుందని..చివరి నిమిషంలో ఆగిపోయారు. ఏసీబీ అడిగిన కస్టడీ ముగియడం… ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో.. బెయిల్ వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో.. అచ్చెన్నను ఉన్న పళంగా అరెస్ట్ చేసి..సబ్ జైలుకు తరలించారు.
ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్న ప్రమేయం ఉందంటూ.. జూన్ పన్నెండో తేదీన ఆయనను నిమ్మాడలోని స్వగృహంలో అరెస్ట్ చేశారు. అంతకు ముందు రోజే ఆపరేషన్ చేయించుకున్నా… ఇరవై గంటలు ప్రయాణం చేయించడంతో… ఆపరేషన్ గాయం తిరగబెట్టింది. దాంతో రెండో సారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా.. ఆరోగ్యం బాగోలేదని చెప్పినా… హడావుడిగా డిశ్చార్జ్ చేసేశారు. అచ్చెన్నను ఒకటి..రెండు రోజులు అయినా జైల్లో ఉంచాలన్నది జగన్ లక్ష్యమని.. అందుకే ఆయన… మంచిచెడూ మర్చిపోయి..వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు.