మచిలీపట్నంలో మోకా భాస్కర్ రావు అనే వైసీపీ నేత హత్య జరిగింది. పరామర్శకు వచ్చిన పేర్ని నాని.. రాజకీయ హత్యే అని మీడియా ముందు గట్టిగా వాదించారు. తర్వాతి రోజు… ఎఫ్ఐఆర్లో పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు చేర్చారు. కానీ దాన్ని సీక్రెట్ గా ఉంచారు. ఆ తర్వాతి రోజు.. మోకా భాస్కర్ రావు బంధువుల పేరుతో కొంత మంది వైసీపీ కార్యక్రతలను.. పోగు చేసి.. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయాలని ధర్నా చేయించారు. సాయంత్రానికి అరెస్ట్ చేశారు. రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేస్తున్నారు. ఇదీ.. మచిలీపట్నంలో మూడు రోజులుగా జరుగుతున్న హత్యా రాజకీయాల పరంపర.
మోకా భాస్కర్ రావును హత్య చేసిన తర్వాత నిందితులు కొల్లు రవీంద్ర పీఏకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ ద్వారా రవీంద్ర మాట్లాడారనేది పోలీసుల అభియోగం. కాల్ రికార్డుల్లో ఇది ఉందో లేదో లేదో… తెలియదు. కాల్ డేటా పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక విచారణ జరిగిందో లేదో తెలియదు కానీ.. ఆయనను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నారు. టీడీపీ నేతలుగా ఉండి కేసుల్లో ఇరుక్కుంటున్న బీసీ నేతల్లో ఈయన నాలుగో ముఖ్య నేత. అచ్చెన్నాయుడు, యనమల, చినరాజప్పతో పాటు ఇప్పుడు కొత్తగా కొల్లు రవీంద్ర ఈ జాబితాలో చేరారు.
కొల్లు రవీంద్ర ఐదేళ్లు మంత్రిగా పని చేశారు. మచిలీపట్నంలో ఎప్పుడూ… శాంతిభద్రతల సమస్య రాలేదు. ఆయన నిజంగా.. అంత వయోలెంట్ పొలిటికల్ లీడర్ అయితే.. మంత్రిగా ఉన్న సమయంలో మచిలీపట్నంలో పరిస్థితులు వేరుగా ఉండేవని టీడీపీ నేతలు అంటున్నారు. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ కనీసం కోపంగా కూడా మాట్లాడరని రాజకీయవర్గాలు చెబుతూ ఉంటాయి. అలాంటి లీడర్‌ను.. ఏకంగా హత్య కేసులో ఇరికించడం వెనుక.. పెద్ద స్కెచ్ ఉందని.. టీడీపీ నేతలు అంటున్నారు. పార్టీలో చేరేందుకు అంగీకరించని వారందరిపై.. ఇలాంటి కేసులతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.