కరోనా వైరస్ టెస్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రముఖంగా నిలబడుతోంది. ఇప్పటికే పది లక్షల మందికి టెస్టులు పూర్తి చేశారు. టెస్టింగ్. ట్రేసింగ్…ట్రీట్మెంట్ అనే విధానంలో ఏపీ సర్కార్ కరోనా నియంత్రణకు ప్రయత్నిస్తోంది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం రోజుకు పాతికవేలకుపైగానే టెస్టులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఐదారు వేల టెస్టులు చేస్తేనే రెండు వేల కేసులు నమోదవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం.. 30వేల టెస్టులు చేసినా వెయ్యిలోపే కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా.. పాజిటివిటీ రేటు చాలా తక్కువ నమోదవుతోంది.
ఇతర రాష్ట్రాలతో సమానంగా.. కేసులు నమోదవుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. పాజిటివిటీ రేటు తక్కువగా ఉండంతో… వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నది.. అధికారవర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ దేశంలో ప్రభావం చూపడం ప్రారంభమైన తర్వాత దేశంలో పెద్దగా టెస్టింగ్ సౌకర్యాలు లేవు. తర్వాత మెల్ల మెల్లగా పెంచుకుంటున్నారు. మెట్రో సిటీలు లేకపోయినప్పటికీ.. ఏపీ సర్కార్ వైరస్ నియంత్రణను సీరియస్‌గా తీసుకుంది. పెద్ద ఎత్తున టెస్టింగ్ సౌకర్యాలను పెంచుకుంది. పరీక్షల్లో అత్యంత ప్రామాణికమైన ఆర్టీ పీసీఆర్ టెస్టుల ల్యాబ్‌లను దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ ఏర్పాటు చేసుకుంది.
ఇక ట్రూన్ నాట్ ద్వారా మరింత సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ఫలితంగా.. ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో భరోసా ఇస్తూ ప్రభుత్వం మంచి పనితీరు కనబరుస్తోంది. క్వారంటైన్.. ఐసోలేషన్ కేంద్రాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి.. మెరుగైన సేవలు అందిస్తూండటంతో.. కరోనా విషయంలో ప్రజల వద్ద ప్రభుత్వానికి మంచి మార్కులు పడుతున్నాయి.