అల్లు వారి ఫ్యామిలీ నుండి వచ్చిన రెండో వారసుడు అల్లు శిరీష్.. ‘గౌరవం’ అనే ప్రతిష్టాత్మక చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ హీరో కొత్తజంట అంటూ వచ్చి ప్రేక్షకులను అలరించాడు. అయితే నిన్న మొన్న వచ్చిన సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ లు మెగా అభిమానులను ఇంప్రెస్ చేస్తుంటే అల్లు శిరీష్ కాస్త వెనుక పడ్డాడని చెప్పాలి. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శిరీష్ ఈరోజు చేసిన ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
త్వరలో తనకు శ్రీమస్తు శుభమస్తు జరుగనున్నదని.. అందరి ఆశీర్వాదాలు కావాలన్ని ట్వీట్ చేశాడు.. అంతేకాదు మిగతా వివరాలు త్వరలో చెబుతా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సాధారణంగా పెళ్లి ఇంట మాత్రమే శ్రీరస్తు శుభమస్తు లాంటి మాటలు వినపడతాయి. అయితే శిరీష్ మాత్రం శ్రీమస్తు అని ట్వీట్ చేయడం స్పెల్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చా లేక తన కొత్త సినిమా ఏదన్నా పెళ్లికి సంబందించినది ఉంటుందా అన్నది ఆలోచిస్తున్నారు నెటిజెన్లు.
మరి ఈ ట్వీట్ ఆంతర్యం ఏమిటో.. మళ్లీ శిరీష్ బాబు ట్వీట్ వేస్తే తప్ప చిక్కిముడి వీడదు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠితో రొమాన్స్ చేస్తున్న శిరీష్ తర్వాత సినిమాల కోసం కథా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది.