అటు కనగరాజు.. ఇటు నిమ్మగడ్డ కాకుండా.. మూడో వ్యక్తిని ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా.. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు గండి పడింది. అధికారులు విధులు నిర్వహించలేకపోతున్నారని అందు వల్ల.. ఇతర వ్యక్తిని ఎస్ఈసీగా నియమించేలా గవర్నర్‌కు సూచనలు ఇవ్వాలంటూ.. ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. అయితే.. ఇలాంటి సూచనలు ఇవ్వలేమని.. సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేసు విచారణను.. మూడు వారాల్లో ముగించాలనుకుంటున్నామని … ఎన్నికల నిర్వహణపై మాట్లాడదల్చుకోలేదని.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టకుండా… చేయడానికి ఏపీ సర్కార్ న్యాయపరంగా ఎన్ని లొసుగులు ఉన్నాయో చూసుకుని.. అన్నింటి ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఓ సాంకేతిక పదం ఆధారంగా.. అసలు గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకమే చెల్లదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. హైకోర్టు తీర్పులో అలా ఉంది కాబట్టి.. .. మధ్యంతరంగా.. విధులు నిర్వహించడానికి వేరే వ్యక్తిని ఎస్ఈసీగా నియమిస్తామనే వ్యూహంతో.. సుప్రీంకోర్టు వద్దకు.. ఏపీ సర్కార్ వెళ్లింది. అయితే.. ఈ విషయంలోనూ ఎదురుదెబ్బ తగిలింది.
విచారణ సందర్భంగా… నిమ్మగడ్డ రమేష్ కుమార్.. పార్క్ హయత్‌లో… సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో సమావేశమైన విషయాన్ని సుప్రీంకోర్టుకు దృష్టికి ప్రభుత్వం తరపు న్యాయవాది తీసుకెళ్లారు. ఎన్నికల కమిషనర్ విషయంలో.. ఏపీ సర్కార్ వ్యవహారశైలి మొదటి నుంచి తీవ్ర వివాదాస్పదమవుతోంది. హైకోర్టు ఆదేశించినా… ఆయనను విధుల్లో చేరేందుకు అడ్డు పుల్ల వేశారు. దీనికి సంబంధించి కోర్టు ధిక్కార పిటిషన్‌ను కూడా.. దాఖలు చేశారు. దానిపై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.