సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కొంతకాలంగా ఆమె శ్వాసకు సంబంధించిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. బుధవార ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు, నెగిటీవ్ గా రిపోర్టు వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జయంతి ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతోందని, ఆమె క్షేమంగానే ఉన్నారని వైద్యులు ధృవీకరించారు.
కొంతకాలం క్రితం కూడా జయంతి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తరవాత ఆమె కోలుకున్నారు. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ… ఇలా పలు భాషల్లో 500లకు పైగా చిత్రాల్లో నటించారు జయంతి. సెంటిమెంట్ పాత్రలకు ఆమె పెట్టింది పేరు. రాజ్ కుమార్‌కి ప్రియమైన హీరోయిన్ ఆమె. ఇద్దరూ కలిసి దాదాపు 30 చిత్రాల్లో జోడీ కట్టారు.