తమిళ ‘ఓ మై కదవులే’ రీమేకు హక్కులు పీవీపీ దగ్గరున్నాయి. ఈ సినిమాని విశ్వక్సేన్తో రీమేక్ చేయాలన్నది ప్లాన్. ఆ విషయం ముందే మీడియాకు లీకైంది. యధావిధిగా వార్తలొచ్చాయి. అయితే విశ్వక్ మాత్రం `ఈ రీమేకులో నేను చేయడం లేద`ని తేల్చేశాడు. దాంతో పీవీపీ మరో హీరోని చూసుకుంటుందేమో అనిపించింది. కానీ.. అలా జరగలేదు. పీవీపీ విశ్వక్‌ని ఒప్పించగలిగింది. చివరికి…. ఈ సినిమా ఓకే చేసేశాడు విశ్వక్. ఈ బేరం కుదరడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి.
ఒకటి పారితోషికం. ఈ సినిమా చేయాలంటే విశ్వక్ 2 కోట్ల పారితోషికం అడిగాడట. విశ్వక్ రేంజుకి అది చాలా ఎక్కువ. కానీ… పీవీపీ ఒప్పుకుంది. మరోటి.. తరుణ్‌భాస్కర్ మధ్యవర్తిత్వం. ‘ఓ మై కదవులే’ రీమేక్‌కి తరుణ్ మాటలు రాస్తున్నాడు. పైగా విశ్వక్‌తో చనువు, స్నేహం ఉన్నాయి. విశ్వక్ ని హీరోగా పరిచయం చేసింది తరుణే. అందుకే…. తరుణ్ మధ్యవర్తిత్వం చేసి విశ్వక్ ని ఒప్పించాడు. అలా ఈ కాంబో సెట్టయింది. మాతృక తీసిన అశ్వంత్ మారిముత్తు రీమేక్‌కీ దర్శకత్వం వహిస్తారు. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణులు వివరాల్ని పీవీపీ త్వరలోనే ప్రకటించనుంది.