తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఒడిదుడుకులు తప్పేలా లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఎవ్వరికీ కొరుకుడు పడేలా కనిపించడం లేదు. పార్టీ సమావేశాలు నిర్వహించినా, పార్టీ తజా స్తితి గతులపై సమీక్షించినా వాటికి తరచుగా డుమ్మా కొడుతున్న ఆర్ కృష్ణయ్య అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నడా లేదా స్వతంత్య్ర అభ్యర్థిగా ఉన్నాడా అనే సందేహాలు ప్రజలలో కలిగేలా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈనేపధ్యంలో చంద్రబాబునాయుడు ఆర్ కృష్ణయ్యతో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నావనే భావనను ఇతరులకు కలుగజేయడానికా అన్నట్లు ప్రత్యేకంగా తాను పురామాయించి ఆర్ కృష్ణయ్యను కూడా ఆహ్వనించి అందరు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఒక చోట సమావేశ పరిచి సమావేశం నిర్వహించారు.
ఇంతవరకు బాగానే ఉంది. చంద్రబాబునాయుడు పిలిపిస్తే మాత్రం ఆయన ఇంట్లో జరిగిన సమావేశానికి హజరైన ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ లెజస్లేటేడ్ పార్టీ కార్యాలయంలో కొత్త కార్యాలయం సభా పక్షనేతగా ఎన్నికైన రేవంత్రెడ్డి సమావేశం నిర్వహిస్తే మళ్లీ డుమ్మాకొట్టారు. ఆ సమావేశానికి కేవలం నలుగురు ఎమ్మెల్యేలే హాజరుకావడం విశేషం. రేవంత్రెడ్డి, ఆరికపూడి గాంధీ, సండ్ర వెంకటయ్య, మాగంటి గోపీనాధ్ మాత్రమే టీడీఎల్పీ సమావేశానికి హాజరుఅయ్యారు. వీరు మాత్రమే స్పీకరు కార్యాలయంలో కలిసి మిగిలిన పది మంది ఎమ్మెల్యేల మీద వేటు వేయాలంటూ ఒక విజ్ఞప్తిని కూడా సమర్పించారు. అదే సమయంలో ఆర్ కృష్ణయ్య ఈ సమావేశానికి డుమ్మాకొట్టడాన్ని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపిస్తే బుజ్జగిస్తే ఆ సమావేశానికి మాత్రమే ఆర్ కృష్ణయ్య హాజరుఅవుతాడనీ, అంతకు మించి తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో అది తన సోంత పార్టీగా ఎలాంటి భావనతోనూ ఆయన వ్యవహరించడం లేదనీ అందరూ గుర్తిస్థున్నారు.
ఉన్నవాళ్లందరూ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ప్రవేశిస్తుండగా మిగిలిన వారిలో ఆర్ కృష్ణయ్యలాంటి కొందరు తెలుగుదేశం పార్టీ తమకు సంబందం లేని పార్టీ అన్నట్లుగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో తెదేప పరిస్థితి మరింత తీసికట్టుగా తయారవుతున్నట్టుగా అనిపిస్తోంది.