జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి… బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత… పట్టుమని ఏడాది కూడా ఉండలేకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి రాజస్థాన్ ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏర్పడింది. జ్యోతిరాదిత్య లానే… రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్.. తన వర్గం ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకునే ఆలోచన చేస్తున్నారు. తన వర్గానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. కొద్ది రోజులుగా… రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ప్రాధాన్యం తగ్గించే పని చేస్తున్నారని .. సచిన్ పైలట్ కినుక వహిస్తున్నారు. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత రాజేష్ పైలట్ కుమారుడు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరు ఉంది.
మూడు రోజుల కిందట… ఒక్కో ఎమ్మెల్యేకు పాతిక కోట్లు ఆఫర్ చేస్తున్నారంటూ.. ఇద్దరు వ్యక్తుల్ని రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. వారు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారని.. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ ప్రయత్నాల వెనుక బీజేపీ ఉందని… మండిపడుతుతున్నారు. ఆ విషయంలో వాంగ్మూలం ఇవ్వడానికి సచిన్ పైలట్‌కు కూడా.. పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ లోపే ఆయన.. తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అయితే బీజేపీ మాత్రం.. చాలా కామ్‌గా ఉంది. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం అని.. తమకు ఏమీ సంబంధం లేదని చెబుతూ వస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. చత్తీస్‌ఘడ్‌లో బంపర్ మెజార్టీతో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఓ మాదిరి మెజార్టీతో అధికారాన్ని దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లో ఓ రకంగా మైనార్టీ ప్రభుత్వమే ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ సీఎం పదవికి… జ్యోతిరాధిత్య, సచిన్ పైలట్ పోటీ పడ్డారు. వారిని కాదని.. సీనియర్లకు చాన్సిచ్చారు రాహుల్ గాంధీ. ఫలితంగా సమయం చూసి.. బీజేపీ వారిని తమ వైపు లాగేసుకుంటోంది.