ప్రధాని మోడీ తాను ఆర్ఎస్ఎస్ ద్వారా సమాజానికి సేవచేయడానికి, సమాజాన్ని ఉద్దరించడానికి తనవంతు పాత్ర పోషించి ఇపుడు ప్రధానమంత్రి అయ్యాడు. తను ఉద్యోగ జీవితం నుంచి రిటైర్ అయ్యాక ఆయన భార్యకూడా ఇప్పుడు సమాజ సేవ చేయడానికి, సమాజ ఉద్దరణకు నడుం బిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాకపోతే ఆమే పేదలకు అనుకూలంగా సమాజిక ఉధ్యమ కారిణి అవతారమెత్తుతోంది. తాను చేపట్టే ఉద్యమాలు ప్రభుత్వానికి ప్రత్పేకంగా భారతీయ జనతా పార్టీకి పంటికింద రాయిలా పరిణమించవచ్చుగాక కానీ, తాను మాత్రం పేదల తరపున పోరాడుతాననే సంకేతాలను ప్రధాన మంత్రి జశోదాబిన్ స్పష్టంగా పంపిస్తోంది. ప్రధానమంత్రితో కలిసి కాకుండా విడిగా ఉంటోన్న ప్పటికీ ప్రధానమంత్రి భార్య అనే హోదాతో ఉన్న జశోదాబిన్ ఇప్పుడు ఉద్యమ కారిణి రూపంలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగానే పోరాటాలకు ఉద్యమిస్తుండటం విశేషం. ఒక టీచరుగా ఇన్నాళ్లుగా ఉద్యోగ భాధ్యతలు గడిపి పదివి విరమన చేసిన జశోదాబిన్ చాన్నాల్లుగా తెరవెనుకనే ఉండిపోయారు.
మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాతనే ఆయన భార్య పేరు అంతో ఇంతో వార్తల్లోకి రావడం అంటూ జరిగింది. అప్పటికీ ఆయనతో తనకు సంబందాలు లేవు అంటూ వీలైనంత వరకు జశోదాబిన్ లో ప్రోఫైల్తో ఉండటానికే ఇష్ట పడుతూ వచ్చారు. ఇటీవలి కాలంలో ఆమె విదేశాలకు వెల్లడానికి పాస్ పోర్టుకు అప్లై చేసుకున్నపుడు మెరేజి సర్టిఫికెట్టు ఇవ్వలేదంటు ఆమె పాస్పోర్టు ధరాఖాస్తును తిరస్కరించడం అందరికీ తెలిసిందే. దీనిక నిరసనగా మోడీకి పాస్పోర్ట్ ఎలా ఇచ్చారో, ఆయనకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో ఏ వివరాలు నమోదు చేశారో తెలుసుకోవాలనే ఉన్నదంటూ ఆమే ఆర్టీఐ ద్వారా ధరఖాస్తు చేసుకోవడం దేశ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే క్రమంలో పేదలకు సంబందించిన గుడిసెలను కూల్చివేయాలనే మహరాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంబిస్తూ యశోదాబిన్ మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.
గుడ్ సమ్మెరిటేన్ మిషన్ అనే సంస్టకు మద్దతుగా ఆమె ఉద్యమంలో పాల్గొనడానికి ముంబాయి రావడం విశేషం. బోంబాయిలో ఉన్నది కూడా భారతీయ జనతా పార్టీయే అయినప్పటికీ పేదల గుడిసెల కూల్చివేత మాత్రం సరియైన నిర్ణయం కాదంటూ ప్రధాని మోడి భార్య నిరాహారదీక్షకు కూర్చోవడం విశేషంగా కనిపిస్తోంది. మొత్తానికి ముందు ముందు జశోదాబిన్ మరింత సీరియస్గా ఉద్యమకారిణి అవతారమెత్తితే పరిపాలనలో ఉన్న మోడికీ చిక్కులు తప్పవేమో అనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.