తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెన్స్‌గా కేసీఆర్ నామకరణం చేసిన ఆస్పత్రి … ఎట్టకేలకు ప్రారంభమయింది. అదిగో.. ఇదిగో అంటూ.. మూడు నెలల నుంచి ఆ ఆస్పత్రి గురించి చెబుతూనే ఉన్నారు. కానీ ప్రారంభించలేకపోయారు. ఎట్టకేలకు ప్రారంభించారు. మొదటగా.. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న ఓ పేషంట్‌ను చేర్చుకున్నారు. ఇతర కేసుల్ని మాత్రం చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు. అంటే.. టిమ్స్‌ను ప్రారంభించారు కానీ.. అందులో ఒక్కరంటే.. ఒక్కర్ని చేర్చుకున్నారన్నమాట. వచ్చిన వారందరికీ.,. హోం ఐసోలేషన్‌కి ప్రిఫర్ చేస్తూ.. వెనక్కి పంపేస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న అత్యధిక కేసులు లక్షణాలు లేకపోవడం లేదా.. స్వల్ప లక్షణాలు ఉన్నవే కావడంతో.. టిమ్స్ వైద్యులు.. హోం ఐసోలేషన్ కు ప్రిఫర్ చేసేస్తున్నారు.
అయితే… కరోనా రోగుల్ని చేర్చుకోకపోవడానికి సిబ్బంది లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉందంని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా… వైద్యులు.. వైద్య సిబ్బంది కొత్తగా విధుల్లో చేరేందుకు దొరకడం లేదు. ఇప్పటికే వివిధ ఆస్పత్రుల్లో సిబ్బంది తీరిక లేకుండా పని చేస్తున్నారు. ఆయా చోట్ల నుంచి టిమ్స్‌కు.,. సిబ్బందిని బదిలీ చేస్తే.. అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే.. కొత్తగా నియమించుకోవాలని చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ.. నియమించుకోవాలనున్నదాంట్లో.. ఇరవై శాతం మందిని కూడా నియమించుకోలేకపోయారు. వారికి కూడా.. కరోనా చికిత్సపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో పది శాతం రోగుల్ని కూడా.. ఆస్పత్రికి తరలించడం లేదు. ఎక్కువగా ఇంట్లోనే చికిత్స పొందమని సలహా ఇచ్చి పంపేస్తున్నారు. ఫలితంగా.. దాదాపుగా అన్ని ఆస్పత్రుల్లోనూ… బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. పైకి మాత్రం.. బెడ్లు ఖాళీ లేవని.. ఇంట్లోనే చికిత్స పొందాలని సూచిస్తున్నారు. అధికారిక లెక్కలంటూ.. 70 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న వివరాలు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు టిమ్స్ విషయంలోనూ అదే జరుగుతోంది. టిమ్స్‌ను ప్రారంభించామని.. మీడియాకు… సమాచారం ఇచ్చారు కానీ.. అందులో పేషంట్లను చేర్చుకోవడం లేదు. తెలంగాణ సర్కార్.. కరోనా టెస్టింగ్ .. ట్రేసింగ్ ను పట్టించుకోవడం లేదని… ఇప్పటికే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.. ట్రీట్‌మెంట్ విషయంలోనూ.., అంతే ఉందని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.