ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండు రోజుల పాటు నమోదన మరణాలు.. 37, 43. అంటే.. రెండు రోజుల్లో 80 మందికిపైగా కోవిడ్ కారణంగా చనిపోయారు. ఈ స్థాయిలో మరణాలు రికార్డవడం.. కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ.. రోజుకూ… మరణాల సంఖ్య పదికి అటూఇటూగానే ఉండేది. కానీ.. ప్రభుత్వం అనూహ్యంగా నిన్న ఒక రోజు 37..మరో రోజు 43 మంది చనిపోయినట్లుగా ప్రకటించింది. అదే సమయంలో పాజిటివ్ కేసులు … రెండు వేలకు దగ్గరగా నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యతో పాటు.. మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. అంటే.. ఆంధ్రప్రదేశ్లో వైరస్ విలయం.. అంతకంతకూ ప్రభావవంతంగా పెరుగుతోందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఏపీ సర్కార్.. తాము దేశంలోని ది బెస్ట్ అనే కోవిడ్ కేర్ ను ప్రజలకు అందిస్తున్నామని ప్రకటించుకుంటోంది. కానీ పరిస్థితి అలా ఉండటం లేదు.
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా సోకితే.. వెంటనే… చికిత్స అందించాలి. లేకపోతే.. పరిస్థితి విషమిస్తోంది. గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో అలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కడప జిల్లాలో ఓ వృద్ధురాలు.. రోడ్డు మీదే ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపింది. అదే తరహాలో.. మరికొన్ని మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం చెబుతున్నదానికి.. బయట జరుగుతున్నదానికి పొంతన లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ కొవిడ్ కేర్ సెంటర్లలో పేషంట్లను పట్టించుకోవడం లేదని… భోజనం కాంట్రాక్టులు.. ఇతర కాంట్రాక్టులు … అధికార పార్టీ నేతలు.. తమ వారికి ఇప్పించుకుని… ఆదాయం సంపాదించుకుంటున్నారు కానీ.. నిజంగా.. ఆ సేవలు… రోగులకు అందుతున్నాయా లేదా.. అన్నదానిపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. అదే సమయంలో…ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. తమకు ఆక్సీజన్ పెట్టలేదని.. ఊపిరి ఆడటం లేదంటూ.. కొంత మంది వీడియోలు.. సోషల్ మీడియాలో పెట్టే పరిస్థితి ఏర్పడింది. చివరికి డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషా.. తిరుపతి కోవిడ్ సెంంటర్లో చేరి… అక్కడ సర్వీసులు నచ్చక హైదరాబాద్ వెళ్లిపోయారు. పరిస్థితులు … మెరుగుపర్చకపోతే.. ఏపీలో కరోనా మరణాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.