తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా తిరుమలకు వెల్లనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సంబందించి తరమొక్కు చెల్లించనందుకు ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి మొక్కు చెల్లించుకోనున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందీ. తెలుగుప్రాంతం రెండురాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఇప్పటిదాక ఒకే ఒక్కసారి ఆంధ్రరాష్ట్రంలో అడుగుపెట్టారు. అమరావతి శంఖుస్థాపనకు హాజరైన కేసీఆర్ కు స్థానికంగా అక్కడి ప్రజలు ఎంత ఘనస్వాగతం పలికారో అందరూ చూశారు. అయితే ఇప్పుడు అఖాలాండకోటి భ్రహ్మాండనాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామికి కానుకలుచెల్లించుకోవడానికి కేసీఆర్ తిరుమలకు వెల్లబోతుండటం విశేషం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కు చెల్లిస్తానంటూ కేసీఆర్ ఉద్యమ సమయంలోనే అనేక మంది దేవుల్లకు మొక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగానే ఆధ్యాత్మిక విశ్వాసాలు మెండుగా ఉన్న కల్వకంట్ల చంద్రశేఖరరావు అటు ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో ప్రస్తుత ఆంధ్రద్రేశ్ ప్రాంతంలో ఉండే అనేక మంది దేవుళ్లకు కుడా అప్పట్లో మొక్కుకున్నట్లుగా చెపుకున్నారు. ఆమెరకు విజయవాడ లోని దుర్గమ్మకు కూడా ముక్కుపుడక చేయించి తన కానుకను చెల్లించుకున్నారు. అదే విధంగా తిరుమల వేంకటేశ్వర స్వామికి సాలగ్రామ హారంచేయిస్తానంటు మొక్కుకున్నట్లుగా కేసీఆర్గతంలో ప్రకటించారు. దీనికి సంబందించి గత ఏడాదిలోనే నిధులు కేటాయించడం కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వపు పురమాయింపు మేరకు తిరుమల తిరుపతి దేవస్థానాల వారు స్వర్ణఖచిత సాలగ్రామ హారాన్ని ప్రస్తుతం తయారుచేయిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఐదుకోట్ల రూపాయల వ్యయంతో చాలా ప్రత్యేకంగా, చాలా ఘనంగా ఉండేలాగా ఈ హరాన్ని తయారుచేయిస్తున్నట్లుగా టీటీడీఈఓ ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని అతి పెద్ద ఆభరణాల తయారీ కంపెనీకి టెండర్ ద్వారా ఆర్డరు ఇచ్చి ఈ సాలగ్రామ హారం తయారీ భాధ్యతను అప్పగించినట్లుగా ప్రకటించారు.
సాలగ్రామం అంటేనే హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాలకు చాలా ప్రశస్తమైన గుర్తింపు ఉంది. అలాంటి సాలగ్రామాలతో హారాన్ని చేయించి తిరుమల వేంకటేశ్వర స్వామికి సమర్పించడం అంటే ఎంతో విశిష్టమైన మొక్కుగా దానిని గురించి చెప్పుకోవాలి. అందుకే ఐదుకోట్ల రూపాయల అతి భారీ వ్యయంతో ఈ హారాన్ని తిరుమల మూలవిరాట్టుకోసం చేయిస్తున్నారు. దీన్ని తయారీ పూర్తైన తర్వాత టీటీడీవో ఆ విషయాన్ని వెల్లడిస్తే కేసీఆర్ స్వయంగా వెళ్లి స్వామి వారికి ఆ హారాన్ని సమర్పిస్తారని తెలుస్తోంది.